Share News

ప్రజలకు అందుబాటులో ఎన్నికల పరిశీలకులు

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:05 AM

తూర్పుగోదావరి జిల్లాకు ఎన్నికల కమిషన్‌ నియమించినప్రత్యేకపరిశీలకులు ధవళేశ్వరం కాటన్‌ అతిథి గృహంలో బస చేసి తమ విధులు నిర్వహిస్తారని అలాగే నిర్ణీత సమయాల్లోప్రజలకు అందుబాటులో ఉంటారని కలెక్టర్‌ కె. మాధవీలత తెలిపారు.

ప్రజలకు అందుబాటులో ఎన్నికల పరిశీలకులు

ధవళేశ్వరం, ఏప్రిల్‌ 25: తూర్పుగోదావరి జిల్లాకు ఎన్నికల కమిషన్‌ నియమించినప్రత్యేకపరిశీలకులు ధవళేశ్వరం కాటన్‌ అతిథి గృహంలో బస చేసి తమ విధులు నిర్వహిస్తారని అలాగే నిర్ణీత సమయాల్లోప్రజలకు అందుబాటులో ఉంటారని కలెక్టర్‌ కె. మాధవీలత తెలిపారు.తమిళనాడుకు చెందిన ఐఏఎస్‌ అధి కారి బాల సుబ్రహ్మణ్యం రాజమహేంద్రవరం పార్లమెంట్‌, రాజమహేంద్రవరంసిటీ, రాజమహేంద్రవరం రూరల్‌, రాజానగరం,అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులుగా నియమితులయ్యారన్నారు. ఈయన 89779 35105 నెంబరక్‌లో సంప్రదించాలని సాయంత్రం 4నుంచి 5గంటల వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు. హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి కమల్‌కాంత్‌ సరోఛ్‌ కొవ్వూరు(ఎస్‌సీ), నిడదవోలు, గోపాలపురం(ఎస్సీ) నియోజకవర్గాల సాధారణ పరిశీలకులుగా నియమితులయ్యారని 89779 35105 ఫోన్‌ నెంబర్‌లో సంప్రదించాలని ఉదయం 9 నుంచి 10గంటల వరకు అం దుబాటులో ఉంటారని తెలిపారు. రాజమహేంద్రవరంపార్లమెంట్‌ నియోజకవర్గ వ్యయ పరిశీలకులుగా ఐఆర్‌ఎస్‌ అధికారి జై.అరవింద్‌ను 89779 35073 ఫోన్‌ నెంబర్‌ ద్వారా,అసెంబ్లీ నియోజకవర్గ వ్యయపరిశీలన కు ఐఆర్‌ఎస్‌ అధికారి రోహిత్‌ నగర్‌ను 89779 35074ఫోన్‌ నెంబర్‌ ద్వారా, పోలీస్‌ పరిశీలకులు ఐపీ ఎస్‌ అధికారి బలరాం మీనాను 87126 02093 నెంబర్‌లో సంప్రదించాలని కలెక్టర్‌ తెలిపారు.

ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించాలి

పోలీస్‌ అబ్జర్వర్‌ బలరామ్‌ మీనా

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగిం చుకునే విధంగా, ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించడానికి పోలీసులు సమష్టిగా సమన్వయంతో నిబద్ధతగా విధులు నిర్వర్తించాలని పోలీస్‌ అబ్జర్వర్‌ బలరామ్‌ మీనా పేర్కొన్నారు. జిల్లాలోని పోలీస్‌ అధికారులతో జిల్లా పోలీసు కార్యాలయంలో గురు వారం ఆయన సమీక్షించారు.

Updated Date - Apr 26 , 2024 | 12:05 AM