Share News

ఐస్‌క్రీం తయారీ కేంద్రాల్లో విజిలెన్స్‌ తనిఖీలు

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:36 AM

ధవళేశ్వర్యంలోని రెండు ఐస్‌క్రీం తయారీ యూనిట్లలో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేశారు. డీఎస్పీ ముత్యాలునాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఐస్‌క్రీం తయారీ కేంద్రాల్లో   విజిలెన్స్‌ తనిఖీలు

కేసులు నమోదు

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): ధవళేశ్వర్యంలోని రెండు ఐస్‌క్రీం తయారీ యూనిట్లలో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేశారు. డీఎస్పీ ముత్యాలునాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వరా ఫ్రోజెన్‌ ఫుడ్స్‌లో తనిఖీలు చేయగా ప్యాకింగ్‌ లైసెన్సు లేకపోవడం, అనుమతుల్లేని తూకాన్ని ఉపయోగించడం, ప్యాకింగ్‌ ఉత్పత్తులపై మ్యాండేటరీ డిక్లరేషన్‌ లేకపోవడం గుర్తించి మూడు కేసులు నమోదు చేశారు. వెనీలా ఫ్రోజెన్‌ డిజర్ట్‌, చాకోబార్‌ మీడియం ఫ్యాట్‌ ఫ్రోజెన్‌ డిజర్ట్‌ నమూనాలను సేకరించి విశ్లేషణకు ల్యాబ్‌కు పంపించారు. అలాగే సత్యసాయి ఫుడ్‌ ప్రోడక్ట్స్‌లో సోదాలు చేసి గడువు ముగిసిన ఆరు ఆర్టిఫీషియల్‌ ఫ్లేవర్‌ ఎమల్షన్‌ బాటిల్స్‌ని సీజ్‌ చేశారు. క్రిమిడే స్ట్రాబెర్రీ ఫ్రోజెన్‌ డిజర్ట్‌, క్రిమిడే వెనీలా ఫ్రోజెన్స్‌ డిజర్ట్‌ నమూనాలను ల్యాబ్‌కి పంపించామని డీఎస్పీ పేర్కొన్నారు. సోదాల్లో విజిలెన్స్‌ అధికారులు నాగ వెంకటరాజు, భార్గవ మహేశ్‌, జగన్నాథరెడ్డి, నవీన్‌, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రని ఆయ

Updated Date - Apr 28 , 2024 | 01:36 AM