Share News

ముగిసిన నామినేషన్ల ఘట్టం

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:04 AM

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది.ఈ నెల 18న నామినేషన్ల స్వీకరణ మొద లైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి గురువారం వరకూ మొత్తం ఏడు రోజుల పాటు జిల్లాలో పార్ల మెంట్‌,ఏడు అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ఎన్నికల అధికారులు స్వీకరించారు.

ముగిసిన నామినేషన్ల ఘట్టం
అనపర్తిలో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేస్తున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి) : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది.ఈ నెల 18న నామినేషన్ల స్వీకరణ మొద లైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి గురువారం వరకూ మొత్తం ఏడు రోజుల పాటు జిల్లాలో పార్ల మెంట్‌,ఏడు అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ఎన్నికల అధికారులు స్వీకరించారు. శుక్రవారం నామినేషన్లు పరిశీలిస్తారు.29వ తేదీన తుది జాబితా ప్రకటిస్తారు. మధ్యలో ఎవరైనా అప్పీల్‌ చేసుకోవచ్చు. తమ నామి నేషన్లు ఉపసంహరించుకోవచ్చు.మే 13న జరిగే సారత్రిక ఎన్నికల పోలింగ్‌ కోసం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ఈ నెల 29వ తేదీ సాయం త్రం 3 గంటలకు ప్రకటిస్తారు. చివరిరోజైన గురు వారం కూడా నామినేషన్లు జోరుగా దాఖలయ్యాయి. రాజమహేంద్రవరం పార్లమెంట్‌కు 7 నామినేషన్లు, జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు 65 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డా. కె.మాధవీలత తెలిపారు.

ఫ రాజమహేంద్రవరం పార్లమెంట్‌కు గురువా రం ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులుగా కొల్లపు వేణు, జల్లి బాల నవీన, గొలు గూరి వెంకటలక్ష్మి నారాయణరెడ్డి, ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్‌ పార్టీ తరపున చేబ్రోలు చైతన్య,రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండియా తరపున వారా ప్రభాకర్‌, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరపున పులగం విజయభా స్కరలక్ష్మి, యుగ తులసీ పార్టీ తరపున కోటగిరి శ్రీనివాసరావు తమ నామినేషన్లు దాఖలు చేశారు.

ఫ అనపర్తి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తరపున నల్లమల్లి మహాలక్ష్మి నామినేషన్లు దాఖలు చేశారు.ఇక స్వతంత్ర అభ్యర్థులుగా కొమ్మరి శారమ్మ, పులగం సూర్రెడ్డి, రేలంగి నాగేశ్వరరావు, రేలంగి ఆసుబాబు, పివివి సత్యనారాయణ, వి.అర వింద్‌, జైభారత్‌ పార్టీ తరపున కారిదాస్‌, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థిగా కొమ్మన సత్య ఝాన్సీ, లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున షేక్‌ సర్దార్‌ హుస్సేన్‌ నామినేషన్లు దాఖలు చేశారు.

ఫ రాజానగరం నియోజకవర్గం నుంచి రాష్ర్టీయ ప్రజా కాంగ్రెస్‌ తరపున కొత్తపల్లి భాస్కరరామం, వైసీపీ తరపున గంధం రాజేశ్వరి, నారం సూర్యలక్ష్మీ నారాయణ, స్వతంత్ర అభ్యర్థులుగా బర్రె ఆనంద కుమార్‌, బత్తుల బాలబ్రహ్మం, బత్తుల వందన అంబిక, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ తరపున ముం డ్రు వెంకట శ్రీనివాస్‌, జై.భారత్‌ నేషనల్‌ పార్టీ తరపున పొనగంట అప్పల సత్యనారాయణ, ఇండి యన్‌ ప్రజాబంద్‌ పార్టీ తరపున మద్దా వెంకట్రావు, బీఎస్పీ తరపున నల్లమిల్లి రవికుమార్‌, జనసేన తరపున దొడ్డా వెంకటేశ్వర్లు, భారతీయ చైతన్యపార్టీ తరపున కట్టా కృష్ణ నామినేషన్లు దాఖలు చేశారు.

ఫ రాజమండ్రి అర్బన్‌ నుంచి వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్‌రామ్‌ తరపున మార్గాని సురేష్‌, పిర మిడ్‌ పార్టీ ఇండియా తరపున యనమదల మోహన్‌బాబు, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి బోడా వెంకటలక్ష్మి తరపున శిఖా బాలాజీ, భార తీయ చైతన్యపార్టీ తరపున వెలిగట్ల సుబ్రహ్మణ్యం, జైభారత్‌ నేషనల్‌ పార్టీ తరపున బహుదూర్‌షా కృష్ణచైతన్య నామినేషన్లు దాఖలు చేశారు.

ఫ రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా గోరంట్ల బుచ్చయ్యచౌదరి, వైసీపీ అభ్యర్ధిగా చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ తరపున గొందేశి శ్రీనివాసరెడ్డి, బీఎస్పీ తరపున కొండపల్లి సూరిబాబు, స్వతంత్ర అభ్యర్థులుగా బుద్దపు శివవిష్ణు ప్రసాదరావు, మనీల్‌ బుచ్చియ్య, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బాలేపల్లి మురళీ,జైభారత్‌ పార్టీ తరపున మన్నవ రఘురామ్‌, జైభీమ్‌రావు పార్టీ తరపున గునిపే కిరణ్‌కుమార్‌ నామినేషన్లు దాఖలు చేశారు.

ఫ కొవ్వూరు ఎస్‌సి నియోజకవర్గం నుంచి తెలు గుదేశం అభ్యర్ధిగా ముప్పిడి వెంకటేశ్వరరావు తరపున అనుపిండి చక్రధరరావు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముప్పిడి సుజాత తరపున ఈడూరి వెంకటరమణ మూర్తి, రాష్ర్టీ ప్రజా కాంగ్రెస్‌ తరపున కొయ్య శేఖర్‌ బాబు, బీఎస్పీ తరపున చొల్లా కుమారి, వైసీపీ తర పున తలారి పరంజ్యోతి,నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ముప్పిడి శేఖరబాబు నామినేషన్లు వేశారు.

ఫ నిడదవోలు నియోజకవర్గం నుంచి వైసీపీ తర పున గెడ్డం శ్రీనివాసనాయుడు, స్వతంత్ర అభ్య ర్థులుగా కంచర్ల దుర్గేష్‌, గిద్దా శ్రీనివాసనాయుడు, గిద్దా వెంకటేశ్వరరావు, బీఎస్పీ తరపున గుమ్మాపు చిత్రసేను, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరపున ముక్కామల అన్నవరపు ప్రసాద్‌, ఎన్‌జేఎస్‌పీ పార్టీ తరపున కొట్టేయాల దుర్గా ప్రసాద్‌, ఐఎన్‌సీ తరపున పెద్దిరెడ్డి సుబ్బారావు, ఎఐఎఫ్‌బి పార్టీ తరపున కస్తూరి వీర ప్రసాద్‌ నామినేషన్లు దాఖలు చేశారు

ఫ గోపాలపురం నియోజకవర్గం నుంచి తెలుగు దేశం పార్టీ తరపున మద్దిపాటి వెంకట్రాజు, జైభారత్‌ పార్టీ తరపున ములగాల శ్రీనివాసరావు, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున షోడదాసి మార్టిన్‌ లూధర్‌, ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్‌ తరపున బాతుల వేణు, నవరంగ కాంగ్రెస్‌ పార్టీ తరపున మద్దిపాటి వెంకటేశులు నామినేషన్లు దాఖలు చేశారు.

ఫ చివరి రోజు రాజమండ్రి పార్లమెంట్‌కు 7, అన పర్తి అసెంబ్లీ స్థానానికి 17, రాజానగరం అసెంబ్లీకి 13, రాజమండ్రి సిటీకి 5, రాజమండ్రి రూరల్‌కు 8, కొవ్వూరు కు 8, నిడదవోలుకు 8, గోపాలపురం అసెంబ్లీకి 6 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువా రం మొత్తం పార్లమెంట్‌కు ఏడు, అసెంబ్లీ స్థానాలు ఏడింటికి కలిపి 65నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా ఏడు రోజులు పార్లమెంట్‌కు 24 .. అసెంబ్లీకి 181 నామినేషన్లు దాఖలయ్యాయి.

Updated Date - Apr 26 , 2024 | 12:04 AM