Share News

వచ్చినవి 411..తిరస్కరణ 114

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:59 AM

సార్వత్రిక ఎన్నికలకు ఉమ్మడి తూర్పుగోదావరి (నిడదవోలు, గోపాలపురం, కొవ్వూరులతో కలిపి) జిల్లాలో మొత్తం 411 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం పరిశీలన అనంతరం 114 నామినేషన్లు తిరస్కరించారు. ఇందులో లోక్‌సభలకు 22, అసెంబ్లీలకు 92 ఉన్నాయి.

వచ్చినవి 411..తిరస్కరణ 114

సార్వత్రిక ఎన్నికలకు ఉమ్మడి తూర్పుగోదావరి (నిడదవోలు, గోపాలపురం, కొవ్వూరులతో కలిపి) జిల్లాలో మొత్తం 411 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం పరిశీలన అనంతరం 114 నామినేషన్లు తిరస్కరించారు. ఇందులో లోక్‌సభలకు 22, అసెంబ్లీలకు 92 ఉన్నాయి.

కోనసీమ జిల్లాలో 31 తిరస్కరణ

అమలాపురం టౌన్‌, ఏప్రిల్‌ 26: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అమలాపురం లోక్‌సభ స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దాఖలైన నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారులు శుక్రవారం పరిశీలించారు. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు మొత్తం 151 నామినేషన్లు దాఖలు చేయగా 31 నామినేషన్లను తిరస్కరించారు. అమలాపురం లోక్‌సభకు 21 నామినేషన్లు దాఖలు కాగా 16 సక్రమంగా ఉండగా ఐదింటిని తిరస్కరించారు. అమలాపురం నియోజకవర్గానికి 21 నామినేషన్లు దాఖలు కాగా 18 ఆమోదం పొంది మూడింటిని తిరస్కరించారు. ముమ్మిడివరం అసెంబ్లీలో 22 నామినేషన్లకు 17 ఆమోదించి ఐదింటిని తిరస్కరించారు. కొత్తపేటలో 18 నామినేషన్లకు నాలుగు తిరస్కరించగా 14 ఆమోదం పొందాయి. మండపేటలో 16 నామినేషన్లకు 13 మంది ఆమోదించగా మూడు తిరస్కరించారు. రామచంద్రపురంలో 21 మందికి 16 ఆమోదించి ఐదు తిరస్కరించారు. రాజోలులో 15 నామినేషన్లకు 11 నామినేషన్లు ఆమోదం పొందగా నాలుగు నామినేషన్లు తిరస్కరించారు. పి.గన్నవరం నియోజకవర్గంలో 17 నామినేషన్లకు 15 ఆమోదం పొందగా రెండు తిరస్కరణకు గురయ్యాయి.

కాకినాడ జిల్లాలో ఇలా..

కలెక్టరేట్‌ (కాకినాడ), ఏప్రిల్‌ 26: కాకినాడ జిల్లాలో కాకినాడ లోక్‌సభకు 18, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 109 నామినేషన్లు దాఖలు కాగా శుక్రవారం రిటర్నింగ్‌ అధికారులు పరిశీలించి 29 నామినే షన్లను తిరస్కరించారు. కాకినాడ లోక్‌సభకు 28 నామినేషన్లు వేయగా 18 ఆమోదించి 10 తిరస్కరించారు. తుని అసెంబ్లీ స్థానానికి 16 నామినేషన్లు రాగా నాలుగు తిరస్కరించి 12 ఆమోదించారు. ప్రత్తిపాడులో 18 నామి నేషన్లు దాఖలు చేయగా మూడు తిరస్కరించి 15 ఆమోదించారు. పిఠాపురంలో 23 నామినేషన్లు దాఖలు చేయగా ఒక్కటి తిరస్కరించి 22 ఆమోదించారు. కాకినాడ రూరల్‌ నియోజకవర్గానికి 20 నామినేషన్లు దాఖలు కాగా రెండు తిరస్కరించి 18 ఆమోదించారు. పెద్దాపురం నియో జకవర్గంలో 12 నామినేషన్లు సమర్పించగా రెండు తిరస్కరించి 10 ఆమో దించారు. కాకినాడ సిటీ అసెంబ్లీకి 22 నామినేషన్లు దాఖలు కాగా ఐదు తిరస్కరించి 17 ఆమోదించారు. జగ్గంపేటలో 17 నామినేషన్లు దాఖలు చేయగా రెండు తిరస్కరించి 15 ఆమోదించారు. మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేశామనీ, నామినేషన్ల పరిశీలన పారదర్శకంగా చేశామని కాకినాడ జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్‌ వెల్లడించారు. ట్రైనీ కలెక్టర్‌ భావన, డీఆర్వో తిప్పేనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో 44 తిరస్కరణ

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం లోక్‌సభ, ఏడు అసెంబ్లీలకు కలిపి మొత్తం 133 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం వాటిని పరిశీలించి 44 నామి నేషన్లు తిరస్కరించినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కె.మాధ వీలత తెలిపారు. రాజమహేంద్రవరం లోక్‌సభకు 19 మంది నామినేషన్లు సమర్పి ంచగా 12 అంగీకరించి 7 తిరస్కరించారు.అనపర్తికి 24 నామినేషన్లు దాఖ లు కాగా 9 ఆమోదించి 15 తిరస్కరించారు. రాజానగరానికి 18 నామినేష న్లు సమర్పించగా 14 ఆమోదించి 4 తిరస్కరించారు. రాజమండ్రి సిటీలో 13 నామినేషన్లు దాఖలు కాగా 11 అంగీకరించి రెండింటిని తిరస్కరించారు. రాజమండ్రి రూరల్‌కు 14 నామినేషన్లు దాఖలు కాగా ఏడు ఆమోదించి 7 తిరస్కరించారు. కొవ్వూరు నియోజకవర్గంలో 14 నామినేషన్లకు 12 ఆమో దించి రెండింటిని తిరస్కరించారు. నిడదవోలుకు 16 నామినేషన్లు దాఖలు కాగా పరిశీలనలో 13 ఆమోదించి మూడింటిని తిరస్కరించారు. గోపాలపు రం నియోజకవర్గంలో 15 నామినేషన్లు వేయగా 11 ఆమోదం తెలిపారు. నాలుగు తిరస్కరణకు గురయ్యాయి.=

Updated Date - Apr 27 , 2024 | 12:59 AM