Share News

ఓట్ల కోసం వచ్చే రాజకీయ పార్టీలను నిలదీయండి

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:30 AM

ఎన్నికల్లో ఓట్లకోసం వచ్చే రాజకీయ పార్టీలను ప్రజలు నిలదీయాలని రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు పిలుపునిచ్చారు.

ఓట్ల కోసం వచ్చే రాజకీయ పార్టీలను నిలదీయండి

రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 27: ఎన్నికల్లో ఓట్లకోసం వచ్చే రాజకీయ పార్టీలను ప్రజలు నిలదీయాలని రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నేరవేర్చని పాలకులను నిలదీయడానికి రాష్ట్రానికి జరిగిన అన్యాయం ప్రజలు వివరించడానికి ఈనెల 14న నెల్లూరులో చేపట్టిన జనచైతన్య యాత్ర శనివారం రాజమహేంద్రవరం చేరుకుంది. ఈ సందర్భంగా రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన, రైతుకూలీ సంఘం రాష్ట్ర నాయకులు కొండ దుర్గారావు, సింగోతు నాగేందర్‌ రావు, ఉమ్మడి జిల్లా జిల్లా కార్యదర్శి బి రమేష్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ జనచైతన్య యాత్ర వచ్చేనెల 5న శ్రీకాకుళం జిల్లాలో ముగుస్తుందన్నారు. నెల్లూరు జిల్లాలో తెలుగ గంగా, కండలేరు ప్రాజెక్టు నిర్వాసితులకు నేటికి పునరావాసం కల్పించలేదని, అలాగే గుంటూరు జిల్లాలో మెట్ట ప్రాంతంలో సాగుభూములకు సాగు నీరు అందించకపోగా కనీసం మంచినీరు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సమావేశంలో ఏఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజబాబు, కె.అంజిబాబు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి యు.సుధాకర్‌, బి.గంగ, కే సతీష్‌ , కళాకారులు రామన్న, రాకేష్‌, అరుంధతి, రాజేశ్వరి, నిషా పాల్గొన్నారు.

సమస్యలపై నాయకులను నిలదీయండి

గోకవరం: ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తున్న పాలకపార్టీ నాయకులను పరిష్కారంకాని తమ సమస్యలపై నిలదీయాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనే యులు అన్నారు. వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 14న నెల్లూరు జిల్లాలో ప్రారంభమైన ప్రజాచైత న్యయాత్ర ప్రకాశం, గుంటూరు, కృష్ణ, పశ్చిమ గోదావరిజిల్లాల నుంచి రాజమహేంద్రవరం మీదుగా శనివారం గోకవరం మండలం రంపయర్రం పాలెం చేరుకొంది. ఈసందర్భంగా ఎస్సీపేటలో ఏర్పాటుచేసిన సభలో వీరాం జనేయులు మాట్లాడుతూ నెరవేర్చలేని వాగ్దానాలు చేస్తూ ప్రజలను వంచిస్తున్న నాయకులకు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. రైతు కూలీ సంఘం ఉమ్మడి జిల్లా కార్యదర్శి బి.రమేష్‌, నాగేంద్ర, వల్లూరి రాజబాబు, కొండదుర్గారావు, కుంచె అంజిబాబు, పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 01:30 AM