Share News

పేపర్‌ మిల్లు ఉద్యోగి అనుమానాస్పద మృతి

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:38 AM

పేపరు మిల్లు ఉద్యోగి అనుమానాస్పద మృతిపై త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ ఎస్‌.ప్రసన్న వీరయ్యగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం..

పేపర్‌ మిల్లు ఉద్యోగి అనుమానాస్పద మృతి

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): పేపరు మిల్లు ఉద్యోగి అనుమానాస్పద మృతిపై త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ ఎస్‌.ప్రసన్న వీరయ్యగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ జగన్నాథపురానికి చెందిన చెల్లుబోయిన విజయ్‌భార్గవ్‌(39) పేపరు మిల్లులో 2013 నుంచి సివిల్‌ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. భార్యతో పేపరుమిల్లు క్వార్టర్సులో నివాసం ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం కుటుం బ తగాదాలతో భార్య పుట్టింటికి వెళ్లిపోయారు. దీంతో భార్గవ్‌ క్వార్టరు లో ఒంటరిగా ఉంటున్నారు. శనివారం ఉద్యోగానికి వెళ్లకపోవడంతో సాయంత్రం 4గంటల ప్రాంతంలో సహోద్యోగి వచ్చి తలుపు కొట్టగా తీయలేదు. సెల్‌ఫోన్‌ రింగ్‌ బయటకు వినిపిస్తున్నా ఆన్సర్‌ చేయలేదు. దీంతో కిటికీలోంచి చూడగా భార్గవ్‌ నిర్జీవంగా కిందపడి ఉన్నాడు. ఆ సహోద్యోగి సమాచారంతో పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఫిట్స్‌, గుండె సంబంధిత వ్యాధులతో భార్గవ్‌ గత కొద్దికాలంగా బాధ పడుతున్నాడని.. అనారోగ్య సమస్యలవల్ల ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చ ని ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని సీఐ పేర్కొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 01:38 AM