Share News

ప్రజా సమస్యలను గాలికొదిలిన సీఎం జగన్‌

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:36 AM

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలను గాలికొదిలి తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని పబ్జీ గేమ్‌ ఆడుకుంటూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు) పేర్కొన్నారు.

ప్రజా సమస్యలను గాలికొదిలిన సీఎం జగన్‌

ముమ్మిడివరం, ఏప్రిల్‌ 27: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలను గాలికొదిలి తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని పబ్జీ గేమ్‌ ఆడుకుంటూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు) పేర్కొన్నారు. శనివారం ఠాణేలంక, పళ్లవారిపాలెం, క్రాపచింతలపూడిపాలెం, కమిని గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తొలుత పదో మైలురాయి సెంటర్‌లో పార్టీ మండల అధ్యక్షుడు అర్థాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో మహిళలు మంగళ హారతులు, పూలతో స్వాగతం పలికారు. ఈసందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇవ్వండంటూ జగన్‌ అధికారంలోకి వచ్చి ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. రాష్ట్రం అన్నివిధాలా అబివృద్ధి సాధించాలంటే ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్నారు. దాట్ల సుబ్బరాజు ఇంటింటికీ వెళ్లి సూపర్‌-6 పథకానలు వివరించారు. ఠాణేలంక పెదపేటలో కొంకి అంబేడ్కర్‌, వాకపల్లి వెంకటరమణ, నక్కా వెంకటరమణ, గిడ్డి వెంకటరమణ, మరో 50మంది వైసీపీ నుంచి టీడీపీలో చేరగా వారికి కండువా కప్పి దాట్ల సుబ్బరాజు పార్టీకి ఆహ్వానించారు. వడ్డిగూడెంలో వైసీపీ నేర చరిత్ర బ్రోచర్లను దాట్ల సుబ్బరాజు ఆవిష్కరించారు. ఆయాకార్యక్రమాల్లో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి మురుగుళ్ల రఘు, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, గుత్తుల సాయి, గొలకోటి దొరబాబు, చెల్లి అశోక్‌, తాడి నరసింహారావు, పొద్దోకు నారాయణరావు, దొమ్మేటి రమణకుమార్‌, గుద్దటి జమి, వేగిరౌతు రాజబాబు, చిక్కాల అంజిబాబు, దంగేటి శ్రీను, గొల్లపల్లి గోపి, పొత్తూరి విజయభాస్కరవర్మ, బొక్కా సత్యనారాయణ, చింతలపూడి భీమశంకర్‌, ఇసుకపట్ల వెంకటేశ్వరరావు, దాట్ల బాబు, కొప్పిశెట్టి శేఠు, జగతా జానకిరామయ్య కొప్పిశెట్టి శ్రీను, ఇసుకపట్ల ఈశ్వర్‌కుమార్‌, పాత్రుని బుజ్జి, నడింపల్లి శ్రీనివాసరావు, మిమ్మితి చిరంజీవి, కుంచనపల్లి సురేష్‌, కుంచనపల్లి నారాయణ, బొంతు నాగరాజు, బొక్కా రుక్మిణి, మెండి కమల, వాసంశెట్టి అమ్మాజీ, కుడుపూడి మల్లీశ్వరి, దున్నాల నాగమణి, గిడ్డి రత్నశ్రీ, మద్దింశెట్టి పురుషోత్తం, పాటి సతీష్‌, దూడల స్వామి, గోదశి పుండరీష్‌, కొప్పిశెట్టి గణేష్‌, యలమంచిలి బాలరాజు, కాశి లాజర్‌, చింతలపూడి కొండబాబు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 01:36 AM