Share News

‘పవన్‌ నామినేషన్‌ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుంది’

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:46 AM

పిఠాపురం, ఏప్రిల్‌ 24: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ నామినేషన్‌ సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి లభించిన అపూర్వ ప్రజాస్పందన రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ తెలిపారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మా ట్లా

‘పవన్‌ నామినేషన్‌  రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుంది’

పిఠాపురం, ఏప్రిల్‌ 24: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ నామినేషన్‌ సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి లభించిన అపూర్వ ప్రజాస్పందన రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ తెలిపారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మా ట్లాడుతూ మంగళవారం జరిగిన పవన్‌ నామినేషన్‌కు 80వేల మందికి పైగా టీడీపీ, జనసేన శ్రేణులు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో పవన్‌ నెగ్గబోతున్నారు అనేందుకు ఇది నిదర్శనమని తెలిపారు. ఉప్పాడలో జరిగిన బహి రంగసభకు ప్రజలు, యువత, మహిళలు ఆశేషంగా తరలివచ్చారన్నారు. కార్యక్రమాలను విజయవంతం చేసిన వారందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాను న్న 20రోజులు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరింత కష్టించి పనిచేయాలన్నా రు. టీడీపీ మండలాధ్యక్షుడు సకుమళ్ల గంగాధర్‌, గాది రాజబాబు, మలిరెడ్డి వెంకటరమణ, కోలా రాజు, దొడ్డు నాగు, నూతాటి ప్రకాష్‌, ఎలుబండి బాబులు, బెజవాడ సురేష్‌, నెక్కల సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:46 AM