Share News

సంపదను సృష్టించే శక్తి కూటమికే ఉంది

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:49 AM

అభివృద్ధి, సంక్షేమం అందించడంతో పాటు సంపదను సృష్టించే సత్తా కలిగిన ఉమ్మడి కూటమి ప్రభుత్వ స్థాపనకు ప్రజలంతా తోడ్పాటునివ్వాలని ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు) పేర్కొన్నారు.

సంపదను సృష్టించే శక్తి కూటమికే ఉంది

ముమ్మిడివరం, ఏప్రిల్‌ 26: అభివృద్ధి, సంక్షేమం అందించడంతో పాటు సంపదను సృష్టించే సత్తా కలిగిన ఉమ్మడి కూటమి ప్రభుత్వ స్థాపనకు ప్రజలంతా తోడ్పాటునివ్వాలని ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు) పేర్కొన్నారు. అమలాపురం పార్లమెంటరీ అభ్యర్థి గంటి హరీష్‌కుమార్‌తో కలిసి ముమ్మిడివరం నగర పంచాయతీ 1,2,3, 4,5,6 వార్డుల్లో రాజుపాలెం, పల్లిపాలెం, నడిమిలంక, నక్కావారిపేట, చింతలమెరక, మార్కెట్‌ ప్రాంతం, తిల్లమ్మచెరువు, గంటావారి వీధుల్లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో భ్రష్టు పట్టించిన వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ఈసందర్భంగా నాణ్యమైన విద్య, వైద్యం కోసం బాబును మళ్లీ రప్పిందాం అనే పోస్టర్‌ను ఆవిష్కరించారు. తన ఐదేళ్ల పాలనలో నియోజకవర్గాన్ని రూ.1800 కోట్లతో అభివృద్ధిచేసి అగ్రపథంలో నిలిపానన్నారు. మళ్లీ తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఐదేళ్ల పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. వార్డుల్లో డ్రెయిన్ల నిర్మాణం, రోడ్ల ఆధునికీకరణ, ప్రతీ ఇంటికీ తాగునీరు వంటి సౌకర్యాలు మెరుగుపరుస్తామన్నారు. మార్కెట్‌ ప్రాంతంలో ఉన్న డంపింగ్‌ యార్డును జనవాసాలకు దూరంగా తరలిస్తామన్నారు. అమలాపురం పార్లమెంటు అభ్యర్థి గంటి హరీష్‌మాధుర్‌ మాట్లాడుతూ ఉమ్మడి మేనిఫెస్టో సూపర్‌-6 పథకాలు ప్రజలకు ఎంతగానో మేలు చేస్తాయన్నారు. కోనసీమను అన్ని రంగాల్లోను అభివృద్ధిచేసి తన తండ్రి బాలయోగి ఆశయాన్ని నెరవేరుస్తానన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధిని గాలికొదిలేసి వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాకులాడారన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తానన్నారు. ఆయావార్డుల్లో మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఈసందర్భంగా రాజుపాలెంలో మాజీ కౌన్సిలర్‌ జగతా గోవిందరావు ఆధ్వర్యంలో వంద మంది పార్టీలో చేరగా కండువాకప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వేకానంద, నాయకులు గుత్తుల సాయి, చెల్లి అశోక్‌, గొలకోటి దొరబాబు, తాడి నరసింహారావు, పొద్దోకు నారాయణరావు, పొత్తూరి విజయభాస్కరవర్మ, అర్థాని శ్రీనివాసరావు, దాట్ల పృథ్విరాజ్‌, గుద్దటి జమ్మి, వేగిరౌతు రాజబాబు, దాట్ల బాబు, చిక్కాల అంజిబాబు, ములపర్తి బాలకృష్ణ, గొల్లపల్లి గోపి, దివి మహాలక్ష్మి, కట్టా సత్తిబాబు, అడబాల సతీష్‌, విళ్ల వీరాస్వామినాయుడు, దివి విజయ్‌, లోకినీడి వెంకటేశ్వరరావు, నడింపల్లి శ్రీనివాసరాజు, జగతా గోవిందరావు, చింతకింద రామకృష్ణ, పాకలపాటి మురళీ, వాసంశెట్టి అమ్మాజీ, సత్తి నూకరాజు, యాళ్ల ఉదయ్‌, గోదశి గణేష్‌, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:49 AM