Share News

రంపచోడవరంలో చివరి రోజు 14 నామినేషన్లు: ఆర్వో

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:06 AM

రంపచోడవరం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గురువారం చివరి రోజు 14 నామినేషన్లు అందాయని రిటర్నింగ్‌ అధికారి ఎస్‌.ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు.

రంపచోడవరంలో చివరి రోజు 14 నామినేషన్లు: ఆర్వో

రంపచోడవరం, ఏప్రిల్‌ 25: రంపచోడవరం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గురువారం చివరి రోజు 14 నామినేషన్లు అందాయని రిటర్నింగ్‌ అధికారి ఎస్‌.ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు. రాజవొమ్మంగి మండలం వేశవరం గ్రామానికి చెందిన లోత రామారావు సీపీఐఎం తరుపున రెండో నామినేషన్‌ దాఖలు చేశారు. వీఆర్‌ పురం మండలం రేఖపల్లి గ్రామానికి చెందిన పూనెం సత్యనారా యణ సీపీఐఎం రెండవ అభ్యర్ధిగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఎటపాక మండలం చెన్నంపేట గ్రామానికి చెందిన రెండోసారి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్‌ వేశారు. రాజవొమ్మంగి మండలం అనంతగిరి గ్రామానికి చెందిన మిరియాల శిరీషదేవి రెండో సారి రెండు నామినేషన్లు దాఖలు చేశారు. రాజవొమ్మంగి మండలం గింజర్తి గ్రామానికి చెందిన మిరియాల లోవలక్ష్మి తెలుగుదేశం డమ్మీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. అడ్డతీగల మండలం రాజానగరం గ్రామానికి చెందిన నాగులపల్లి ధనలక్ష్మి తరుపున ఎల్లవరం గ్రామానికి చెందిన నక్క వీర్రాజు నామినేషన్‌ దాఖలు చేశారు. అడ్డతీగల మండలం రాజానగరం గ్రామానికి చెందిన నాగులపల్లి ధనలక్ష్మి వైకాపా తరుపున ఎల్లవరం గ్రామానికి చెందిన తోట దేవేంద్రుడు నామినేషన్‌ దాఖలు చేశారు. అడ్డతీగల మండలం వేటమామిడి గ్రామానికి చెందిన బొడ్డపాటి రాఘవ వైఎఎస్‌ఆర్‌ పార్టీ తరుపున డమ్మీ అభ్యర్థిగా నిమినేషన్‌ వేశారు. రంపచోడవరం మండలం సిరిగిందలపాడు గ్రామానికి చెందిన పాలడుగు శ్రీ వెంకటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్ధిగా రెండోసారి నామినేషన్‌ వేశారు. గంగవరం మండలం మోహనాపురం గ్రామానికి చెందిన మద్దేటి అంజిరెడ్డి భారత్‌ ఆది వాసీ పార్టీ తరుపున నామినేషన్‌ వేశారు. చింతూరు మండలం చట్టి గ్రా మానికి చెందిన తుర్రం అశోక్‌కుమార్‌ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. గంగవరం మండలానికి చెందిన కుంజం వీరవెంకటసత్యనారాయణమ్మ స్వత ంత్ర అభ్యర్ధిగా నామినేషన్‌ వేశారు. కూనవరం మండలం తాళ్లగూడెం గ్రామా నికి చెందిన బంగారు వెంకటేశ్వర్లు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. నియోజవర్గంలో నేటి వరకు 17 మంది అభ్యర్థులకుగాను 26 నామి నేషన్‌ పత్రాలు అందాయన్నారు. ఏఆర్వో ఎ.కృష్ణజ్యోతి, తహశీ ల్దారు నాగరాజు. డీటీలు ఎన్‌వీవీ సత్యనారాయణ, బి.రాజు, శివ, రామకృష్ణ, చైతన్య, విశ్వనాధ్‌, సరిత, బాలాజీ, శ్రీఽధర్‌, రవీంద్రబాబు, వీరభద్రరావు పాల్గొన్నారు.

రంపలో 17 మంది అభ్యర్థులకు 26 నామినేషన్లు: ఆర్వో

రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గంలో 17 మ ంది అభ్యర్థులకుగాను 26 నామినేషన్లు వేసినట్లు రిటర్నింగ్‌ అధికారి ఎస్‌.ప్రశాం త్‌కుమార్‌ తెలిపారు. నామినేషన్లను నేడు(శుక్రవారం) పరిశీలన జరుగుతుంద న్నారు. ఈనెల 29న మధ్యాహ్నం 3గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుందన్నారు.

ఆఖరి రోజు నామినేషన్ల జోరు

రాజానగరం, ఏప్రిల్‌ 25 : నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆఖరి రోజైన గురువారం నామినేషన్ల దాఖలు జోరందుకున్నాయి. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ తరపున కొత్తపల్లి భాస్కరరామం రెండో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేయగా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున గంధం రాజేశ్వరి, నాలం సూర్యలక్ష్మి నారాయణ రెండవ సెట్టు నామినేషన్‌ దాఖలు చేశారు. ఇండిపెండెంట్‌ అభ్యర్ధిగా బర్రే ఆనందకుమార్‌ రెండో సెట్లు, ఇండిపెండెంట్‌ అభ్యర్ధిగా బత్తుల బాలబ్రహ్మం నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున ముండ్రు వెంకట శ్రీనివాస్‌ మూడు, నాలుగు సెట్లు నామినేషన్‌ దాఖలు చేయగా, జై భారత్‌ నేషనల్‌ పార్టీ తరపున పొనగంటి అప్పల సత్యనారాయణ నామినేషన్‌ దాఖలు చేశారు. ఇండియన్‌ ప్రజాబంధు పార్టీ తరపున మద్దా వెంకటరావు, బహుజన సమాజ పార్టీ తరపున, నల్లమిల్లి రవికుమార్‌, కూటమి అభ్యర్ధి బత్తుల బలరామకృష్ణ కుమార్తె బత్తుల వందన అంబిక ఇండిపెండెంట్‌ అభ్యర్ధిగా, కూటమి అభ్యర్ధి బత్తుల బలరామకృష్ణ తరపున దొడ్డ వెంకటేశ్వర్లు రెండు సెట్లు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. భారతీయ చైతన్య పార్టీ తరపున కట్టా కృష్ణ రెండో సెట్టు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసినట్లు ఆర్వో చైత్రవర్షిణి తెలిపారు.

Updated Date - Apr 26 , 2024 | 12:06 AM