Share News

AP Politics: నెగిటివ్‌ను పాజిటివ్‌గా మార్చుకునే కుట్ర జరుగుతుందా..?

ABN , Publish Date - Apr 17 , 2024 | 03:07 PM

సీఎం జగన్‌పై రాయి దాడి ఘటన అనేక మలుపులు తిరుగుతోంది. నాలుగు రోజులైనా.. నిందితులెవరో పోలీసులు చెప్పకపోవడం.. విచారణ పేరుతో జాప్యం చేస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ప్రజల్లో అనేక అనుమానాలు కలుగు తున్నట్లు తెలుస్తోంది. ఓ సీఎంపై రాయి విసిరిన వ్యక్తిని గుర్తించడానికి ఎందుకిత ఆలస్యం అవుతుందనేది మొదటి ప్రశ్న అయితే..

AP Politics: నెగిటివ్‌ను పాజిటివ్‌గా మార్చుకునే కుట్ర జరుగుతుందా..?
CM YS Jagan

సీఎం జగన్‌(YS Jagan)పై రాయి దాడి ఘటన అనేక మలుపులు తిరుగుతోంది. నాలుగు రోజులైనా.. నిందితులెవరో పోలీసులు చెప్పకపోవడం.. విచారణ పేరుతో జాప్యం చేస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతున్నట్లు తెలుస్తోంది. ఓ సీఎంపై రాయి విసిరిన వ్యక్తిని గుర్తించడానికి ఎందుకిత ఆలస్యం అవుతుందనేది మొదటి ప్రశ్న అయితే.. సాంకేతికతను ఉపయోగించుకుని ఎన్నో అసాధ్యమైన కేసులను త్వరితగతిన చేధించే చరిత్ర ఉన్న ఏపీ పోలీసులు.. ఈ చిన్న కేసును చేధించడానికి ఎందుకు ఆలస్యం అవుతుందనే విషయం ఎవరికి అంతుపట్టడం లేదు.


ఎన్నికల వేళ ప్రధాని మొదలు వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఉంటారు. ఈక్రమంలో వారందరికీ భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసు శాఖపై ఉంటుంది. ఒక ముఖ్యమంత్రిపై సొంత రాష్ట్రంలో ఓ అపరిచిత వ్యక్తి రాయి విసిరే సహసం చేయడమే ప్రజల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది.

YCP: ద్వారకా తిరుమలలో వైసీపీ నాయకులతో కలిసి అధికారుల బరితెగింపు


మొదట ఒకలా.. ఇప్పుడు మరోలా..

రాయి విసిరిన వ్యక్తి దొరికాడని, అతడిని ప్రశ్నిస్తే తమను సభకు తీసుకొచ్చి క్వాటర్ మందుతో పాటు.. రూ.350 ఇస్తామని చెప్పి మీటింగ్‌కు వచ్చాక క్వాటర్ చేతిలో పెట్టి.. డబ్బులు ఇవ్వకపోవడంతోనే రాయి విసిరినట్లు విచారణలో చెప్పినట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని పోలీసులు ఖండించినట్లు తెలుస్తోంది. కేసు విచారణలో జాప్యం జరుగు తుండటం, అసలు నిందితులెవరో ఇంకా తెలియకపోవడంతో ఈ ఘటనపై ప్రజలు అనేక అనుమానాలు లేవనెత్తుతున్నారు. కొందరైతే ఈ దాడి వెనుక వైసీపీ నేతలే ఉన్నారని, సానుభూతి కోసం దాడి చేయించుకుని ఉంటారని ఆరోపిస్తున్నారు. మరోవైపు డబ్బులు ఇవ్వనందుకు దాడి చేసిన విషయం వాస్తవమైతే మాత్రం అది వైసీపీ(YSRCP)కి ఎన్నికల్లో నెగిటివ్ కావడంతో పాటు.. జగన్‌ను బలహీనుడ్ని చేస్తుంది. వైసీపీ సభలకు జనాన్ని డబ్బులిచ్చి తరలిస్తున్నారనే విషయం వేగంగా ప్రజల్లోకి వెళ్తుంది. అందుకే అసలు విషయాన్ని దాచే ప్రయత్నం జరుగుతుందనే విమర్శలు లేకపోలేదు. పోలీసులు అధికారికంగా వివరాలు వెల్లడిస్తే తప్పా ఈ ఘటనకు కారకులు ఎవరు అనేది తెలిసే అవకాశం ఉంది.


బొండాను ఇరికించే ప్రయత్నమా..!

రాయి దాడి ఘటనకు టీడీపీని బాధ్యులు చేసేందుకు ఓ కుట్ర జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న టీడీపీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు ఈ దాడి వెనుక ఉన్నారని చెప్పించేలా ఓ ప్రయత్నం జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుతో సంబంధంలేని వ్యక్తులను కేసులో ఇరికించి.. వారి ద్వారా బొండా పేరు చెప్పించాలనే కుట్రకు వైసీపీ పెద్దలు తెరలేపారనే చర్చ నడుస్తోంది. ఇలా చేయడం ద్వారా ఎన్నికల్లో సానుభతి కొట్టేయడంతో పాటు.. టీడీపీపై నెగిటివ్ ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుందనే వ్యూహంలో వైసీపీ నేతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పోలీసులు నిస్వార్థంగా విచారణ చేపట్టి.. నిందితులకు శిక్ష పడేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


AP Elections: మదనపల్లి చుట్టూ ఔటర్ ఏది..? ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయిందా: షర్మిల

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 17 , 2024 | 03:07 PM