Share News

AP Elections: పంపకాలు స్టార్ట్.. తొలి విడతలో రూ.4వేలు.. టార్గెట్ వాళ్లే..

ABN , Publish Date - Apr 28 , 2024 | 03:42 PM

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. పోలింగ్‌కు 15 రోజుల సమయం మాత్రమే ఉంది. రెండోసారి అధికారం కోసం వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. సాధారణంగా ఎన్నికల్లో ఒకటి లేదా రెండు రోజుల ముందు పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓట్లకు నోట్లు పంపిణీ చేసే కార్యక్రమానికి తెరలేపుతుంటారు. వాస్తవానికి ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓట్లుకు నోట్లు పంచడం చట్టరీత్యా నేరం అని తెలిసినప్పటికీ.. గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు నోట్ల పంపిణీకి శ్రీకారం చుడతాయి. ఈసారి వైసీపీకి క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో.. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తగ్గకపోవడంతో.. కొన్ని నియోజకవర్గాల్లోని వైసీపీ నాయకులు ఇప్పటికే పంపకాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది.

AP Elections: పంపకాలు స్టార్ట్.. తొలి విడతలో రూ.4వేలు.. టార్గెట్ వాళ్లే..
Notes Distribution

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. పోలింగ్‌కు 15 రోజుల సమయం మాత్రమే ఉంది. రెండోసారి అధికారం కోసం వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. సాధారణంగా ఎన్నికల్లో ఒకటి లేదా రెండు రోజుల ముందు పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓట్లకు నోట్లు పంపిణీ చేసే కార్యక్రమానికి తెరలేపుతుంటారు. వాస్తవానికి ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓట్లుకు నోట్లు పంచడం చట్టరీత్యా నేరం అని తెలిసినప్పటికీ.. గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు నోట్ల పంపిణీకి శ్రీకారం చుడతాయి. ఈసారి వైసీపీకి క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో.. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తగ్గకపోవడంతో.. కొన్ని నియోజకవర్గాల్లోని వైసీపీ నాయకులు ఇప్పటికే పంపకాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ప్రధానంగా ఓటర్లను ప్రభావితం చేయగలిగే వ్యక్తులను గుర్తించి.. వాళ్లకు నోట్ల పంపిణీ పూర్తిచేసినట్లు ప్రచారం జరుగుతోంది. తమ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయాలని, చుట్టుపక్కల ఉన్న ఓటర్లను వైసీపీకి ఓటు వేసేలా ప్రభావితం చేయాలని కోరుతూ కొన్ని నియోజకవర్గాల్లో తొలివిడతగా రూ.4వేలు నుంచి రూ.6వేల చొప్పున పంపిణీ చేసినట్లు తెలుస్తోంది.

Sharmila: సీఎం జగన్.. లాయర్ పొన్నవోలు మధ్య క్విడ్ ప్రోకో

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన ఓ అభ్యర్థి నియోజకవర్గంలోని కొన్ని రంగాలకు చెందిన వ్యక్తులను గుర్తించి.. వాళ్లందరికీ రూ.4వేల చొప్పున పంపిణీ పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాస్టర్లు, గ్రామాల్లో ప్రాక్టీస్ చేసే ఆర్‌ఎంపీ డాక్టర్లు, వివిధ రంగాలకు చెందిన ఓటర్లను ప్రభావితం చేయగలిగే వ్యక్తులు, గ్రామంలోని కుల పెద్దలను గుర్తించి ఒక్కొక్కరికి రూ.4వేలు పంచారని సమాచారం. పోలింగ్‌కు ముందు రోజు ఓటర్లకు పంపిణీ చేసేందుకు డబ్బులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో గెలుపును అధికారపార్టీ అభ్యర్థి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఓడిపోతే తమ కుటుంబానికి రాజకీయ ప్రాధాన్యత తగ్గుతుందనే ఆలోచనతోనే ఎంత డబ్బు ఖర్చుపెట్టేందుకైనా వెనుకాడటంలేదట. అధికార పార్టీ అభ్యర్థి ఓటుకు రూ.3వేల వరకు పంచవచ్చనే చర్చ నియోజకవర్గంలో జరుగుతుందట.

అధిష్టానం ఆదేశాలతోనే..

అంతర్గత సర్వేల ప్రకారం వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని తేలడంతో ప్రలోభాల పర్వానికి తెరలేపాలని అధిష్టానం నుంచి వైసీపీ అభ్యర్థులకు ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కుల పెద్దలతో పాటు.. గ్రామాల్లో ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తులకు నోట్లు పంచిపెట్టడం ద్వారా.. వైసీపీకి అనుకూలంగా వాళ్లంతా వ్యవహరించేలా వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా పాస్టర్లు, ఆర్‌ఎంపీ వైద్యులను ప్రలోభపెట్టి.. వారిదగ్గరకు వచ్చే ఓటర్లకు వైసీపీకి ఓటు వేయాలనే ప్రచారం చేసేలా వైసీపీ అధిష్టానం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆర్థికంగా ఒకరిద్దరు అభ్యర్థులు బలహీనంగా ఉంటే వారికి అధిష్టానం అవసరమైన నగదును అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇసుక దందాలో సంపాదించి..!

నది తీర ప్రాంతాల్లో ఇసుక క్వారీల ద్వారా కోట్ల రూపాయిలను వైసీపీ నాయకులు దోచుకున్నారనే ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికల్లో ఖర్చుపెట్టేందుకే సొంత పార్టీ నాయకులు ఇసుక దందా చేస్తున్న సీఎం జగన్ పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. గత ఐదేళ్లుగా ఇసుక దందాలో సంపాదించిన డబ్బులను ఇప్పుడు ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. నోట్లతో ఓట్ల కొనుగోలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ప్రజలు కోరుతున్నారు. ప్రలోభాల ప్రభావం ఎన్నికలపై ఏమేరకు ఉంటుందనేది జూన్4న తేలనుంది.

AP Elections 2024: ఏపీ రాజకీయాలపై జయప్రద ఇంట్రస్టింగ్ కామెంట్స్..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Apr 28 , 2024 | 03:42 PM