Share News

AP Elections 2024: మే 1 సెలవు.. అయినా పెన్షన్ల పంపిణీ

ABN , Publish Date - Apr 28 , 2024 | 07:12 PM

పెన్షన్ల పంపిణీపై వైయస్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీన లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ ఆదేశాలు జారీ చేశారు.

AP Elections 2024: మే 1 సెలవు.. అయినా పెన్షన్ల పంపిణీ
YS Jagan Mohan Reddy

అమరావతి, ఏప్రిల్ 27: పెన్షన్ల పంపిణీపై వైయస్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీన లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ ఆదేశాలు జారీ చేశారు.

అయితే మే 5వ తేదీ లోపు బ్యాంక్ అకౌంట్లు లేని వారికి, దివ్యాంగులకు, రోగులకు ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేయాలని.. ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు. కాగా ఇంతకు ముందు వలంటీర్ల ద్వారా పెన్షన్ నగదు పంపిణీ చేసిన విషయం విధితమే.


మే 1వ తేదీ మేడే. ఆ రోజు బ్యాంకులకు సెలవు. అటువంటి పరిస్థితుల్లో పెన్షన్లు లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో ఎలా వేస్తారనే సందేహం సైతం వ్యక్తమవుతుంది. మే 13వ తేదీన అటు లోక్‌సభ, ఇటు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఆ క్రమంలో ప్రజలను బుట్టలో వేసుకునేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే ఓ చర్చ సైతం నడుస్తుంది.


ఇప్పటికే తాము సంక్షేమ పథకాలు పేరుతో లబ్దిదారుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేశామని వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ వివిధ సభల్లో ప్రకటిస్తున్నారు. ఎన్నికల వేళ.. ఏ మాత్రం ఆలస్యం కాకుండా నగదు లబ్దిదారుల ఖాతాల్లో పడే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టిందనే చర్చ నడుస్తుంది.

మరోవైపు వాలంటీర్లు ఎన్నికలకు దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో పలువురు వాలంటీర్లతో వైసీపీ బలవంతంగా రాజీనామా చేయించి... తద్వారా వైసీపీ కార్యకర్తలుగా వారితోనే నగదు పంపిణి చేయిస్తున్నారనే ఓ ప్రచారం సైతం రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది.

Read National News and Telugu News

Updated Date - Apr 28 , 2024 | 07:12 PM