Share News

29 నామినేషన్లు తిరస్కరణ

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:50 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా వివిధ పార్టీల అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. శుక్రవారం అన్ని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాల్లో నామినేషన్లు పరిశీలించారు. దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు.

29 నామినేషన్లు తిరస్కరణ

- పరిశీలన పూర్తి

- నేటి నుంచి ఉపసంహరణకు అవకాశం

శ్రీకాకుళం, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి) : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా వివిధ పార్టీల అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. శుక్రవారం అన్ని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాల్లో నామినేషన్లు పరిశీలించారు. దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు. నిబంధనల ప్రకారం లేని వాటిని, ప్రధాన అభ్యర్థులకు బదులుగా వేసిన నామినేషన్లను తిరస్కరించారు. జిల్లాలో శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గంతోపాటు.. ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 208 నామినేషన్లు నమోదు కాగా.. 29 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇందులో శ్రీకాకుళం పార్లమెంట్‌ పరిధిలో 33 నామినేషన్లు రాగా.. మూడు తిరస్కరించారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 175 నామినేషన్లు పడ్డాయి. వీటిలో ఆమదాలవలస -6, నరసన్నపేట -3, పలాస -4, శ్రీకాకుళం -1, ఇచ్ఛాపురం -4, ఎచ్చెర్ల -5, పాతపట్నం -3, టెక్కలి -3 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. పాతపట్నం నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి రెడ్డి శాంతమ్మ.. నామినేషన్‌ దాఖలు చేసినప్పుడు సరిగ్గా ప్రమాణం చేయలేకపోయారన్న కారణంతో ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు. అయితే వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి పేరుతో సరిపోలనుండడంతో.. ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేసిన రెడ్డి శాంతమ్మ నామినేషన్‌ను అధికారం ఉపయోగించి.. తిరస్కరించేలా చేయించారని విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఒకే పేరుతో రెండు ప్రధానపార్టీలకు సంబంధించి నామినేషన్లను ఆమోదించారు. కాగా నామినేషన్ల ఉపసంహరణకు శనివారం నుంచి సోమవారం వరకు గడువుంది. ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య తేలనుంది.

Updated Date - Apr 26 , 2024 | 11:50 PM