Share News

80 కుటుంబాలు టీడీపీలో చేరిక

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:21 PM

బూర్జ మండలం అయ్యవారిపేట గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్‌ కొత్తకోట రామినాయుడు, మరో 80 కుటుంబాల వారు గురువారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు.

80 కుటుంబాలు టీడీపీలో చేరిక
ఆమదాలవలస: టీడీపీలో చేరిన వారితో రవికుమార్‌

ఆమదాలవలస: బూర్జ మండలం అయ్యవారిపేట గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్‌ కొత్తకోట రామినాయుడు, మరో 80 కుటుంబాల వారు గురువారం వైసీపీని వీడి టీడీపీ లో చేరారు. వీరికి ఉమ్మడి అభ్యర్థి కూన రవికుమార్‌ కండు వాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీల నిధుల ను మళ్లించి నిర్వీర్యం చేసిందని, అందువల్లే ఇటీవల అయ్యవారిపేట సర్పంచ్‌ ఇప్పిలి అంబు జాక్షి, సిమ్మన్న తమ అనుచరులతో టీడీపీలో చేరారని, అందుకే గ్రామమంతా రవి కుమార్‌కు మద్దతు పలకాలని ఉద్దేశంతో టీడీపీలో చేరా మన్నారు.
పొందూరు: రాపాక పంచాయతీ ఇల్లయ్య గారిపేట, వావిలపల్లిపేట గ్రామాల్లో గురువారం ఉమ్మడి అభ్యర్థి కూన రవికుమార్‌ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సూపర్‌సిక్స్‌ పఽథకాలను వివరించారు. కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జి పేడాడ రామ్మోహన్‌, బీజేపీ ఇన్‌చార్జి పి. సూరపునాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.
ఒక్క అవకాశం ఇవ్వండి: గోవిందరావు
కొత్తూరు:
తనకు ఒక్క అవకాశం ఇస్తే పాతపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఉమ్మడి అభ్యర్థి మామిడి గోవిందరావు అన్నారు. సోమరాజపురం, శోభనాపురం, జాతల పేట, గొల్లంగిపేట, ఆకులతంపర, వెంకటాపురం, గురండి, దాశరధిపురం, కాశీపురం గ్రామాల్లో గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సూపర్‌ సిక్స్‌ పథకాలను ఓటర్లకు వివరించారు. వెంకటాపురానికి చెందిన వైసీపీ నాయకులు మొగిలి చిన్నారావు, గాది సుబ్బారావు, సన్నిబోయిన అప్పన్న, పిండి నూకరాజుతో పాటు సుమారు 30 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. వీరికి మామిడి గోవిందరావు పార్టీ కండువా లు వేసి ఆహ్వానించారు.
కలమటను కలిసిన ఎంజీఆర్‌
పాతపట్నం:
టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడిగా నియమి తులైన మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణమూర్తిని గురువారం ఉమ్మడి అభ్యర్థి మామిడి గోవిందరావు మర్యాద పూర్వకంగా కలిసి అభినందించారు. మీ ఆశీస్సులు కావాలని కోరారు. పార్టీ ఆదేశాల మేరకు పార్టీ విజయం కోసం కృషి చేద్దామని కలమట రమణ అన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:21 PM