Share News

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:33 PM

జిల్లాలో వివిధ ప్రాంతాల్లో శనివారం రోడ్డుప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. అలాగే ఇతర ప్రమాదాల్లోనూ మరణాలు సంభవించాయి.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

జిల్లాలో వివిధ ప్రాంతాల్లో శనివారం రోడ్డుప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. అలాగే ఇతర ప్రమాదాల్లోనూ మరణాలు సంభవించాయి.
గార: తూలుగు జంక్షన్‌ సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో గారకి చెందిన మార్పు ఓం దత్తకుమార్‌ (19) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. దత్త కుమార్‌ ద్విచక్ర వాహనంపై శ్రీకాకుళం వైపు వెళుతుండగా తూలుగు మిల్లు సమీపంలో శ్రీకాకుళం నుంచి కొర్ని వెళుతున్న మినీ లగేజ్‌ వ్యాన్‌ వేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో దత్తకుమార్‌ తీవ్రంగా గాయపడ్డాడు. కొన ఊపిరితో ఉన్న అతడిని 108లో శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కృష్ణ ప్రసాద్‌ తెలిపారు. మృతుడి తండ్రి రమణమూర్తి గార మెయిన్‌ రోడ్డులో చిన్న ఎలక్ర్టికల్‌ సామాన్లు బాగుచేస్తుంటారు.
గుంటూరుకు చెందిన డ్రైవర్‌..
కంచిలి:
కంచిలి మండలం పుణ్యస్త్రీ గెడ్డ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరుకు చెందిన డి.రమేష్‌ అనే లారీ డ్రైవర్‌ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పలాస నుంచి ఇచ్ఛాపురం వైపు వెళ్తున్న లారీ గెడ్డ సమీంపంలో ఎదురుగా వస్తున్న వాటర్‌ ట్యాంకర్‌ను బలంగా ఢీకొంది. దీంతో లారీ నుజ్జు నుజ్జు కావడంతో పాటు లారీ డ్రైవర్‌ దనికుల రమేష్‌ తీవ్ర గాయాలు పాలయ్యాడు. వెంటనే క్షతగాత్రుడిని సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందు తూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజేష్‌ తెలిపారు.
కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ..
హిరమండలం:
భగీరధపురం గ్రామ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం లో పెద్ద కిట్టాలపాడుకి చెందిన పోగేటి సంతోష్‌ కుమార్‌ (28) మృతి చెందాడు. ఎస్‌ఐ నారాయణస్వామి అందించిన వివరాలిలా ఉన్నాయి.. సంతోష్‌ ఈనెల 25న తన పెద్దమ్మ పెద్ద కర్మకు బలద గ్రామం వెళ్లాడు, డబ్బులు అవ సరం కావడంతో శుక్రవారం రాత్రి రెండు గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై బలదలో బయలు దేరి స్వ గ్రామమైన కిట్టాలపాడు వస్తున్నాడు. భగీరధపురం సమీపంలో డొక్కులు కానా మలుపు వద్ద బైక్‌ అదుపు తప్పి బోల్తా పడ్డాడు. వెంటనే సమీపంలోని గొట్ట పోలమ్మ గుడి వద్ద ఉంటున్న వారు 108కి ఫోన్‌ చేయగా క్షతగాత్రు డిని పాతపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. మృతుడు పెయింటింగ్‌ పని చేసుకుంటే జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. భార్య గౌరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నారాయణ స్వామి తెలిపారు.

Updated Date - Apr 27 , 2024 | 11:33 PM