Share News

జిల్లాకు ఎన్నికల పోలీసు పరిశీలకుడి రాక

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:22 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎన్నికల పరిశీలకుడిగా (పోలీసు అబ్జర్వర్‌) మహారాష్ట్రకు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి దిగంబర్‌ పి.ప్రధాన్‌ గురువారం ఆయన జిల్లాకు చేరుకున్నారు.

జిల్లాకు ఎన్నికల పోలీసు పరిశీలకుడి రాక
పోలీస్‌ అబ్జర్వర్‌ దిగంబర్‌ పి.ప్రధాన్‌కి పుష్పగుచ్ఛం ఇస్తున్న ఎస్పీ రాధిక

శ్రీకాకుళం క్రైం: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎన్నికల పరిశీలకుడిగా (పోలీసు అబ్జర్వర్‌) మహారాష్ట్రకు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి దిగంబర్‌ పి.ప్రధాన్‌ గురువారం ఆయన జిల్లాకు చేరుకున్నారు. స్థానిక పోలీసు కార్యాలయం అతిథి గృహంలో ఆయనను ఎస్పీ జీఆర్‌ రాధిక మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఎన్ని కలకు సంబంధించిన పోలీసు శాఖా పరమైన అంశాలపై చర్చించారు. శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్న పేట, పాతపట్నం, టెక్కలి, పలాస, ఇచ్చాపురం నియోజక వర్గాలకు ఎన్నికల పోలీసు పరిశీలకుడిగా వ్యవహ రించనున్నారు. ఏఎస్పీ జి.ప్రేమ్‌ కాజల్‌ ఆయనను కలిశారు.
కలెక్టర్‌ను కలిసిన ఎన్నికల పరిశీలకులు
కలెక్టరేట్‌:
జిల్లా ఎన్నికల పరిశీలకులుగా వచ్చిన సీని యర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు గురువారం కలెక్టర్‌ చాంబర్‌లో కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో సందీప్‌కుమార్‌ (ఐఏ ఎస్‌), పోలీసు పరిశీలకుడు దిగంబర్‌ ప్రధాన్‌ (ఐపీఎస్‌), విజయనగరం జిల్లా పార్లమెంటు నియోజకవర్గ పోలీసు పరిశీలకుడు సత్యేంద్ర పటేల్‌ (ఐపీఎస్‌), జనరల్‌ అబ్జర్వర్‌ టాట్‌ పర్వేజ్‌ ఇక్బాల్‌ (ఐపీఎస్‌) ఉన్నారు. ఎన్నికల ఏర్పాట్లపై వారు చర్చించారు.
నిశితంగా పరిశీలించండి
నరసన్నపేట:
నామినేషన్‌ పత్రాలను నిశితంగా పరిశీలించాలని ఎన్నికల పరిశీలకుడు శేఖర్‌ విద్యార్థి అన్నారు. గురువారం నరసన్నపేట ఆర్వో కేంద్రాన్ని పరిశీలించారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేం దుకు సిబ్బంది సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. ప్రచారాలపై నిఘా పెంచాలని, మద్యం, నగదు పంపిణీలపై డేగకన్ను వేయా లని నిఘా బృందా లకు ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్వో రామ్మోహన్‌రావు, ఏఆర్వో కనకారావు, సిబ్బంది పాల్గొన్నారు.
నేడు నామినేషన్ల పరిశీలన
టెక్కలి:
టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంతవరకు దాఖలైన నామినేషన్లను శుక్ర వారం పరిశీలించనున్నట్లు ఆర్వో, సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ ఒక ప్రకటనలో తెలి పారు. ఉదయం 11 గంటలకు స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాల యంలో నామినేషన్ల పరిశీలన ఉంటుందని, నామినేషన్‌ వేసిన అభ్యర్థులు లేదా వారి సహాయకులు నిర్ణీత సమయా నికి చేరుకోవాలని కోరారు. ఈనెల 18 నుంచి 25 వరకు జరిగిన నామినేషన్ల ప్రక్రియపై జనరల్‌ అబ్జర్వర్‌ సందీప్‌ కుమార్‌ గురువారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఆరా తీశా రు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సామ గ్రిని పరిశీలించి ఏఆర్వో మురళీకృష్ణ సూచనలు చేశారు.
రికార్డుల పరిశీలన
పాతపట్నం:
తహసీల్దార్‌ కార్యాలయంలోని నామినేషన్‌ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు నవీన్‌కుమార్‌ సోనీ గురువారం పరిశీలించారు. నియోజకవర్గపరిధిలో ఎన్ని కల వ్యయ పరిశీలకులుగా వ్యవహరిస్తున్న క్షేత్రస్థాయి అధి కారులతో సమావేశం నిర్వహించారు. రికార్డులను పరిశీలిం చి పలు సూచనలిచ్చారు. ఆయన వెంట ఆర్వో ఎం.అప్పా రావు, తహసీల్దార్‌ వైఎస్‌వీవీ ప్రసాదరావు ఉన్నారు.
నిర్భయంగా ఓటును వేయాలి
నందిగాం:
ఓటర్లు ఓటుహక్కును నిర్భయంగా వినియో గించుకోవాలని టెక్కలి నియో జకవర్గ ఎన్నికల అధికారి, సబ్‌కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ అన్నారు. గురువారం నరేంద్ర పురంలో పోలీసు బలగాలతో మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడుతూ.. ఎన్నికల నియమా వళిని తప్పనిసరిగా పాటించాలని, ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో టి.శివప్రసాద్‌, ట్రైనీ డీఎస్పీ రాజా, నందిగాం ఎస్‌ఐ మహ్మద్‌ అమీర్‌ ఆలీ తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:23 PM