Share News

పాలకా.. మా కష్టాలు పట్టవా?

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:26 PM

వంశధార నది చెంతన ఉన్న గార మండల రైతన్నలకు దశాబ్దాలుగా సాగునీటి సమస్య వేధిస్తోంది.

పాలకా.. మా కష్టాలు పట్టవా?
తోణంగి వద్ద పిచ్చిమొక్కలతో నిండిపోయిన కాలువ

-భైరి సాగునీటి కాలువపై నిర్లక్ష్యం

-గట్లు బలహీనపడి.. షట్టర్లకు తుప్పు పట్టిన వైనం

- పిల్ల కాలువలదీ ఇదే పరిస్థితి

- గార మండల రైతుల ఆగ్రహం

(గార)

వంశధార నది చెంతన ఉన్న గార మండల రైతన్నలకు దశాబ్దాలుగా సాగునీటి సమస్య వేధిస్తోంది. ఇక్కడ వేలాది ఎకరాలకు సాగునీరందించే అవకాశమున్నా సాగునీటి కాలువలు అభివృద్ధికి నోచుకోకపోవడం, గట్టు బలహీనపడడం, షట్టర్లు తుప్పుపట్టడంతో రైతులకు అగచాట్లు తప్పడంలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాలువల నిర్వహణపై నిర్లక్ష్యం చూపడంతో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందని పరిస్థితి నెలకొంది. సాగునీటి కాలువల నిర్వహణకు అవసర మైన నిధులు ఖరీఫ్‌ సీజన్‌కు ముందు విడుదల చేకపోవడంతో అధికా రులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. పాలకులకు తమ కష్టాలు పట్టవా అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మండలంలో బైరి లింక్‌ కాలువ ద్వారా బూరవల్లి, గార, శాలిహుండాం, కొర్ని, కొర్లాం వమరవెల్లి, తోణంగి కళింగపట్నం తదితర గ్రామాల్లో 16 వేలఎకరాల ఆయకట్టుకు నీరందాల్సి ఉంది. అయితే దశా బ్దాలుగా ఈ కాలువతోపాటు మిగిలిన పిల్లకాలువల్లో పూర్తిస్థాయిలో పూడిక, పిచ్చిమొక్కలు తొలగించక పోవడంతోపాటు గట్లు చాలాచోట్ల బలహీన పడినా పటిష్టపరచేలేదు. గట్లు బలహీనంగా ఉండడంతో ఏటా వర్షాకాలంలో కాలువలోకి నీరు చేరే సమయంలో కొట్టుకుపోవడంతో నీరు పొలాలను ముంచెత్తి ముంపు నకు గురవుతున్నాయి. ఫలితంగా దిగువ ప్రాంతాల్లోని గ్రామాల్లో గల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. బూరవెళ్లి, అంబల్లవలస, తంగుళ్లపేట, వమరవెల్లి, కళింగపట్నం, తదితర చోట్ల దశాబ్దాల కిందట వేసిన షట్టరు తుప్పు పట్టిపోయి విరిగిపోవడంతో కాలువల్లో నీరు పొలాలకు వెళ్లకుండా వృథాగా కిందకు పోతోంది. షట్టర్ల దుస్థితిని అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా నిధులు లేకపోవడంతో మరమ్మతులకు నోచుకోలేదు. ఖరీఫ్‌ సీజన్‌కు ముందు ఏటా కాలువలను మరమ్మతు చేసి సిద్ధం చేసే వారు. ప్రస్తుతం వేతనదారులతో అక్కడక్కడ కొన్ని కాలువల్లో పూడిక తొలగించి చేతులు దులుపుకుంటున్నా, పూర్తిస్థాయిలో మర మ్మతులు చేయడం లేదు. బైరి లింక్‌ కాలువ కాలువతో పాటు పదేళ్ల కిందట ఏర్పాటు చేసిన వంశధార కాలువ ద్వారా కూడా వత్సవ లస, ఎర్రగుడ్డి, జల్లపేట తదితర గ్రామాల్లోని శివారు ప్రాంతాల్లో భూము లకు పూర్తి స్థాయిలో నీరందక అక్కడ పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. కాలువల్లో పూడిక తొలగించకపోవడంతో పలు గ్రామా ల్లో రైతులు వ్యవసాయ మోటార్లు ఆధారంగా పంటలను సాగు చేస్తు న్నారు. నారాయణపురం కాలువ ద్వారా వాడాడ, శ్రీకూర్మం, దీపావళి, సిమ్మపేట తదితర గ్రామాల్లో వేలాది ఎకరాలకు పూర్తి స్థాయిలో నీరందడం లేదు. సాగునీటి సమస్య పరిష్కరించి తమ పంటలను కాపాడాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు, అధికారుల దృష్టికి తీసుకువె ళ్తున్నా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:26 PM