Share News

నలుగురు స్పీకర్లను అందించిన సిక్కోలు

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:27 PM

శ్రీకాకుళం జిల్లా రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు. ఉమ్మడి రాష్ట్రంలోనైనా, అవశేష ఆంధ్రప్రదేశ్‌లో నైనా రాజకీయాల్లో జిల్లాది చెరగని ముద్ర. ఎంతో మంది హేమాహేమీలను జాతికి అందించింది ఈ జిల్లా.

నలుగురు స్పీకర్లను అందించిన సిక్కోలు

- ఆంధ్ర రాష్ట్ర రెండో సభాపతిగా రొక్కం నరసింహం దొర

- ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికైన తంగి శ్యామలరావు, ప్రతిభాభారతి

- నవ్యాంధ్ర రెండో స్పీకర్‌గా తమ్మినేని సీతారాం

(రణస్థలం)

శ్రీకాకుళం జిల్లా రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు. ఉమ్మడి రాష్ట్రంలోనైనా, అవశేష ఆంధ్రప్రదేశ్‌లో నైనా రాజకీయాల్లో జిల్లాది చెరగని ముద్ర. ఎంతో మంది హేమాహేమీలను జాతికి అందించింది ఈ జిల్లా. సర్దార్‌ గౌతు లచ్చన్న విపక్ష నేతగా వ్యవహ రించగా.. మజ్జి తులసీదాస్‌ ఉమ్మడి రాష్ట్రం పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. వచ్చేది ఏ ప్రభుత్వం అయినా.. కేబినెట్‌లో కీలక పోర్టు పోలియోలను ఈ జిల్లాయే దక్కించుకోవడం విశేషం. ఏకంగా శాసన సభాపతులుగా నలుగురు నేలు వ్యవహరించడం గమనార్హం. ఇప్పటివరకూ రాష్ట్ర శాసనసభ స్పీకర్లుగా జిల్లాకు చెందిన రొక్కం నరసింహందొర, తంగి సత్య నారాయణ, కావలి ప్రతిభాభారతి, తమ్మినేని సీతారాం పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఇందులో రొక్కం నరసింహందొర ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా, తమ్మినేని సీతారాం నవ్యాంధ్రప్రదేశ్‌ రెండో స్పీకర్‌గా ఎంపికయ్యారు. మిగతా ఇద్దరు ఉమ్మడి ఏపీ రాష్ట్ర శాసనసభ స్పీకర్లుగా ఎంపిక కావడం విశేషం.

- ఆంధ్ర రాష్ట్ర శాసనసభ రెండో స్పీకర్‌గా రొక్కం నరసింహందొర పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈయన తొలితరం కాంగ్రెస్‌ నాయకుడు. 1955లో టెక్కలి నుం చి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమ యంలో దాదాపు ఏడాదిన్నరపాటు స్పీకర్‌గా వ్యవహ రించారు. 1955 ఏప్రిల్‌ 23 నుంచి 1956 డిసెంబరు 3 వరకూ ఆయన పదవిలో ఉన్నారు.

- ఏపీ శాసనసభ ఏడో స్పీకర్‌గా జిల్లాకు చెందిన తంగి సత్యనారాయణ ఎన్నికయ్యారు. 1983 జనవరి 18 నుంచి 1984 ఆగస్టు 28 వరకూ శాసనసభ స్పీకర్‌గా వ్యవహరించారు. ఎన్టీఆర్‌ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ప్రభుత్వంలో తంగి సత్యనారాయణ స్పీకర్‌గా ఎన్నిక కావడం విశేషం. ఈయన శ్రీకాకుళం అసెంబ్లీ నియో జకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1967, 1983లో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శాసనసభలో జరిగే చర్చలు ప్రజలకు యథాతధంగా చేరాలని, వార్తా పత్రికలు రాజకీయపరమైన, వ్యక్తిగత రాగధ్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తూ సభా కార్యక్రమాలను నిష్పక్షపాతంగా అందించాలని 1983 సెప్లెంబరు 19న రూలింగ్‌ ఇచ్చారు.

- ఏపీ శాసనసభ 11వ స్పీకర్‌గా జిల్లాకు చెందిన కావలి ప్రతిభాభారతి పదవీ బాద్యతలు చేపట్టారు. ఏపీ అసెంబ్లీ చరిత్రలో ఈమె తొలి మహిళా స్పీకర్‌ రికార్డు సాధించారు. 1999 నవంబరు 11 నుంచి2004 మే 30 వరకూ ఆమె పదవిలో కొనసాగారు. ఆమె వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎచ్చెర్ల నుంచి ప్రాతినిధ్యం వహించారు. అంతకు ముందు ఎన్టీఆర్‌, చంద్రబాబు హయాంలో కీలక మంత్రిత్వ శాఖలను నిర్వర్తించారు. 1999లో చంద్రబాబు హయాంలో ఆమెకు స్పీకర్‌ పదవి వరించడం విశేషం. 2000 సెప్టెంబరు 13న వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై జరిగిన చర్చల సమయంలో ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకూ..13 గంటల పాటు శాసనసభను నిర్వహించారు.

- నవ్యంధ్రప్రదేశ్‌కు రెండో స్పీకర్‌గా తమ్మినేని సీతారాం 2019 మే 30న పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈయన ఆమదాలవలస నుంచి ఎమ్మెలేగా ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. మంత్రి పదవిని ఆశించారు. కానీ ఈయనకు స్పీకర్‌ పదవికి ఎంపిక చేస్తూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈయన అధ్యక్షతన ప్రస్తుతం చివరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా యి. టీడీపీతో రాజకీయ అరంగేట్రం చేసిన తమ్మినేని సుదీర్ఘ కాలం ఆ పార్టీలో కొనసాగారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీలో చేరారు.

మాది రైతుల ప్రభుత్వమని, వారికి చేయూతనిస్తూ, సాగునీటి ప్రాజెక్టులు అభివృద్ధి చేస్తున్నామని వైసీపీ నాయకులు నిత్యం గొప్పలు చెబుతుంటారు. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కంచిలి మండలంలోని గంగసాగరంతోపాటు మరికొన్ని ప్రాజెక్టుల పనులు నిలిచిపోవడమే దీనికి ఉదాహరణ. 2019 ఎన్నికల ముందు పాదయాత్రతోపాటు వివిద సందర్భాల్లో అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్‌ గంగసాగ రాన్ని రిజర్వాయర్‌గా మారుస్తా మని హామీ ఇచ్చారు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:27 PM