Share News

Pakistan: తాత్కాలికంగా ఎక్స్ నిలిపివేత

ABN , Publish Date - Apr 17 , 2024 | 05:17 PM

దేశంలో సోషల్ మీడియా ప్లాట్‌పాం ఎక్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పాకిస్థాన్ బుధవారం ప్రకటించింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సోషల్ మీడియా ఎక్స్ ఉపయోగించడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని యూజర్స్ వెల్లడించారు.

Pakistan: తాత్కాలికంగా ఎక్స్ నిలిపివేత

కరాచీ, ఏప్రిల్ 17: దేశంలో సోషల్ మీడియా ప్లాట్‌పాం ఎక్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పాకిస్థాన్ బుధవారం ప్రకటించింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సోషల్ మీడియా ఎక్స్ ఉపయోగించడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని యూజర్స్ వెల్లడించారు.

Arrow System: ఇజ్రాయెల్‌ బ్రహ్మాస్త్రం.. ‘యారో’..

ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి నెల మధ్య నుంచి ఎక్స్‌ను ప్రభుత్వం అనధికారికంగా నిలిపివేసింది. అయితే ఎక్స్ నిలిపివేస్తున్నట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా బుధవారం కోర్టుకు నివేదించింది. ఈ సోషల్ మీడియా వేదిక దుర్వినియోగం అవుతుంది.. ఆ క్రమంలోనే దీనిపై తాత్కాలిక నిషేధం విధించినట్లు పేర్కొంది.

UAE: ఎడారి నేలలో జలప్రళయం.. భీకర వర్షాలతో వణుకుతున్న దుబాయి

ఇటీవల దేశంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ శ్రేణులు ఆరోపించారు. ఆ క్రమంలో ఆందోళలకు ఇమ్రాన్ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో ఎక్స్‌ను అనధికారికంగా నిలిపివేశారు.

Updated Date - Apr 17 , 2024 | 06:04 PM