Share News

Ayodhya: అయోధ్యలోనే కాదండోయ్.. ఈ ఆలయాల్లోనూ సూర్య తిలకం పడతాయట...

ABN , Publish Date - Apr 17 , 2024 | 05:32 PM

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని అయోధ్య ( Ayodhya ) బాల రాముని ఆలయంలోని మూల విరాట్ నుదుటిపై సూర్యకిరణాలు పడే విధంగా సూర్య తిలకం ఏర్పాటు చేశారు. సూర్యుని నుంచి వచ్చే కిరణాలను కటకాలు, దర్పణాల ద్వారా పరావర్తనం చెందించి రాముడి విగ్రహాన్ని తాకేలా రూపొందించారు.

Ayodhya: అయోధ్యలోనే కాదండోయ్.. ఈ ఆలయాల్లోనూ సూర్య తిలకం పడతాయట...

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని అయోధ్య ( Ayodhya ) బాల రాముని ఆలయంలోని మూల విరాట్ నుదుటిపై సూర్యకిరణాలు పడే విధంగా సూర్య తిలకం ఏర్పాటు చేశారు. సూర్యుని నుంచి వచ్చే కిరణాలను కటకాలు, దర్పణాల ద్వారా పరావర్తనం చెందించి రాముడి విగ్రహాన్ని తాకేలా రూపొందించారు. రాముడు సూర్యవంశానికి చెందిన రాజు. కాబట్టి ఈ సూర్యతిలకానికి ఆలయ అధికారులు, పురాణాలు అధిక ప్రాధాన్యత ఇచ్చాయి. ఐఐటీ-రూర్కీ శాస్త్రవేత్తలు అయోధ్యలోని రాంలల్లా ఆలయంలో సూర్య తిలక్ ను ఏర్పాటు చేశారు. ఏటా రామనవమిన రామ్ లల్లా నుదిటిపై సూర్యకిరణాలను పడే విధంగా రూపకల్పన చేశారు. అయితే అయోధ్య రామాలయం కంటే ముందే ఈ విధానం మన దేశంలోని అనేక దేవాలయాలలో ఏర్పాటు చేయడం విశేషం.


Elections 2024: అవినీతికి ఛాంపియన్ ప్రధాని మోదీ.. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో రాహుల్ ఫైర్..

తమిళనాడులోని సూర్యనార్ కోవిల్ టెంపుల్ ను 11-12వ శతాబ్దంలో నిర్మించారు. ఇది సూర్యునికి అంకితం చేయబడిన ఆలయం. కొన్ని ప్రత్యేక సమయాల్లో సూర్యకాంతి సూర్యనార్ విగ్రహం పై పడేలా ఏర్పాటు చేశారు. గుజరాత్ లోని కోబా జైన దేవాలయంలో ఏటా సూర్యాభిషేకం జరుగుతుంది. సూర్యకిరణాలు నేరుగా మహావీరస్వామి పాలరాతి విగ్రహం నుదుటిపై మధ్యాహ్నం 2.07 గంటల నుంచి మూడు నిమిషాలు పడతాయి. మధ్యప్రదేశ్ లోని ఉనవ్ బాలాజీ సూర్య దేవాలయంలో తెల్లవారుజామున సూర్యుని మొదటి కిరణాలు నేరుగా ఆలయ గర్భగుడిలో ఉన్న విగ్రహంపై పడతాయి.


Ayodhya: అయోధ్య రాముడికి అపూర్వ ఘట్టం.. ఆ వేడుకనూ మీరూ చూసేయండి..

గుజరాత్ లోని మొధేరా సూర్య దేవాలయంలో ఏడాదికి రెండుసార్లు సూర్యకిరణాలు ఆలయంలోకి ప్రవేశించి సూర్యదేవుని విగ్రహంపై పడతాయి. ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయంలో సూర్యోదయ సమయంలో ఆలయంలో సూర్య కిరణాలు పడతాయి. సూర్యుని మొదటి కిరణాలు ఆలయ ప్రధాన ద్వారాన్ని తాకి, తర్వాత గర్భగృహంపై ప్రసరిస్తాయి. రాజస్థాన్ లోని రణక్‌పూర్ జైన దేవాలయం ఆరావళిలోని 15వ శతాబ్దానికి చెందిన పాలరాతి ఆలయం. సూర్యకాంతి గర్భగుడిలోకి ప్రవేశించేలా రూపొందించారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 17 , 2024 | 05:35 PM