Share News

CWC: కరవుతో అల్లాడుతున్న దక్షిణ భారతం.. సీడబ్ల్యూసీ నివేదికలో విస్తుపోయే విషయాలు

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:09 AM

దక్షిణ భారతదేశాన్ని కరవు పట్టి పీడిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు దక్షిణాది రాష్ట్రాల్లో తాండవిస్తున్నాయి. సీడబ్ల్యూసీ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో చాలా రిజర్వాయర్లలో నీటిమట్టం అడుగంటిపోయింది.

CWC: కరవుతో అల్లాడుతున్న దక్షిణ భారతం.. సీడబ్ల్యూసీ నివేదికలో విస్తుపోయే విషయాలు

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ భారతదేశాన్ని కరవు పట్టి పీడిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు దక్షిణాది రాష్ట్రాల్లో తాండవిస్తున్నాయి. సీడబ్ల్యూసీ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో చాలా రిజర్వాయర్లలో నీటిమట్టం అడుగంటిపోయింది.

ప్రత్యక్ష నీటి నిల్వలు 17 శాతం తగ్గిపోయాయి. సీడబ్ల్యూసీ పర్యవేక్షణలో ఉన్న 42 రిజర్వాయర్‌లు మొత్తం 53.334 బిలియన్ క్యూబిక్ మీటర్ల (BCM) ప్రత్యక్ష నీటి నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న ప్రత్యక్ష నీటి నిల్వ 8.865 BCM మాత్రమే. జలాశయాలు అడుగంటడంతో ఆయా రాష్ట్రాల్లో సాగు, త్రాగునీటి సరఫరా, జలవిద్యుత్ ఉత్పత్తి ప్రశ్నార్థకంగా మారుతోంది.


రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న ప్రత్యక్ష నిల్వ శాతాన్ని నివేదిక హైలైట్ చేసింది. అస్సాం, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో అంతగా ఈ సమస్య లేదు. గుజరాత్, మహారాష్ట్ర సహా పశ్చిమ ప్రాంతంలో రిజర్వాయర్లు 11.771 BCM నిల్వ స్థాయిలను కలిగి ఉన్నాయి. పర్యవేక్షించిన 49 రిజర్వాయర్ల మొత్తం సామర్థ్యంలో ఇది 31.7 శాతానికి సమానం.

Uttarakhand: నైనిటాల్‌లో కార్చిచ్చు.. భారత ఆర్మీ రంగంలోకి

ఇది 2023లో నమోదైన నిల్వ స్థాయిలు, పదేళ్ల సగటు కంటే తక్కువ. ఉత్తర, మధ్య భారత రాష్ట్రాలు సైతం నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. బ్రహ్మపుత్ర, నర్మదా, తపతి నదీ పరీవాహక ప్రాంతాలు సాధారణ నిల్వ స్థాయిల కంటే ఎక్కువ నీటిని కలిగి ఉన్నాయి. అయితే మహానది, పెన్నార్, కావేరి నదుల పరివాహక ప్రాంతాలు తీవ్ర కరవును ఎదుర్కొంటున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Updated Date - Apr 28 , 2024 | 11:09 AM