Share News

Walk after eating : రాత్రి తిన్న తర్వాత నడుస్తున్నారా? దీనివల్ల కలిగే లాభాలేంటో తెలుసా? ?

ABN , Publish Date - Apr 23 , 2024 | 01:29 PM

భోజనం తర్వాత 30 నిమిషాల పాటు చురుకైన నడక వల్ల ఎక్కువగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Walk after eating : రాత్రి తిన్న తర్వాత నడుస్తున్నారా? దీనివల్ల కలిగే లాభాలేంటో తెలుసా? ?
Walk after eating

రాత్రి పూట కడుపునిండా తినే వారు.. కాస్త నడిచినా అలసట, కడుపునొప్పి ఇతర ఇబ్బందులు కలుగుతాయని నమ్ముతూ ఉంటారు. తిన్న వెంటనే నడవ కూడదని పెద్దలు కూడా వారిస్తూ ఉంటారు. ఇది ఎంతవరకూ కరెక్ట్. తిన్నాకా నడిస్తే ఏం అవుతుంది. తిన్న తరవాత నడవడం అనేది ఆరోగ్యానికి మంచి ఫలితాలను ఇస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్న మాట. రాత్రి పూట భోజనం తర్వాత నడవడం అనేది బరువు తగ్గడానికి సహకరిస్తుంది. భోజనం తర్వాత 30 నిమిషాల పాటు చురుకైన నడక వల్ల ఎక్కువగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర నిర్వహణను మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవడంలో సహాయపడుతుంది. మెరుగైన నిద్రకు సహకరిస్తుంది. తిన్న తర్వాత నడవడం వల్ల లాభాలు, నష్టాల గురించి తెలుసుకుందాం.

మెరుగైన జీర్ణ క్రియ...

రాత్రి నడక వల్ల ఉబ్బరం, మలబద్దకం, యాసిడ్ రిఫ్లక్స్, కడుపు నొప్పి సమస్యలు తగ్గుతాయి. జీర్ణక్రియ సాఫీగా సాగే విధంగా సహకరిస్తుంది.

గుండె జబ్బుల నుంచి..

గుండె ఆరోగ్యం విషయంలో ఆందోళన పడేవారు రాత్రి భోజనం తర్వాత నడవడం వల్ల గుండెల్లో మంట, గుండె పోటు, స్ట్రోక్, ఇతర గుండె సమస్యలు తగ్గుతాయి.

Healthy Food : బియ్యానికి బదులుగా గోధుమ రవ్వను తీసుకుంటే..!

రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు..

తిన్న తర్వాత నడక వల్ల బ్లద్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఇలా చేయని వారిలో ప్రీ డయాబెటిస్, టైప్ 2 డయాబెటిక్ సమస్య పెరుగుతుంది. కనుక నడక మంచే చేస్తుంది.


Sleep Changes: మహిళల్లో నిద్ర లేమి సమస్యలు ఎందుకు వస్తాయంటే..!

తిన్న తర్వాత ఎప్పుడు నడవాలి..

రాత్రి భోజనం తర్వాత శారీరక శ్రమ చేస్తే కడుపులో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. కాబట్టి నడక అది 15 నిమిషాలు నడకతో బరువు తగ్గే అవకాశం కూడా ఉంది.

అతిగా ఏదీ వద్దు..

తిన్న తర్వాత అతిగా వ్యాయామం చేయడం కూడా మంచిది కాదు. ఇది జీర్ణ క్రియ సమస్యలకు దారితీస్తుంది. కనుక తిన్నాకా ఓ అరగంట పాటు సాదా నడక నడిస్తే సరిపోతుంది.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 23 , 2024 | 02:56 PM