TDP: కర్నూలులో బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకర యాత్ర దృశ్యాలు..

ABN, Publish Date - Apr 16 , 2024 | 09:27 AM

హిందూపూర్ టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకర యాత్రలో భాగంగా సోమవారం కర్నూల్‌లో పూలబజార్ నుండి కొండారెడ్డి బురుజు వరకు రోడ్ షో.. అనంతరం కొండారెడ్డి బురుజు వద్ద పబ్లిక్ మీటింగ్ నిర్వహించారు. బాలయ్య సభకు జనం నీరాజనం పలికారు. యాత్రలో మహిళలు, మైనార్టీలు కిక్కిరిపోయారు. ఈ సందర్బంగా బాలయ్య మాట్లాడుతూ.. ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వ్యాఖ్యానించారు. కర్నూలు తెలుగు దేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి టీజీ భరత్‌‌ను గెలిపించాలని ప్రజలకు బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు.

TDP: కర్నూలులో బాలకృష్ణ  స్వర్ణాంధ్ర సాకర యాత్ర దృశ్యాలు.. 1/6

స్వర్ణాంధ్ర సాకర యాత్రలో భాగంగా సోమవారం కర్నూలుకు విచ్చేసిన టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రజలకు అభివాదం తెలుపుతున్న దృశ్యం.

TDP: కర్నూలులో బాలకృష్ణ  స్వర్ణాంధ్ర సాకర యాత్ర దృశ్యాలు.. 2/6

ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సోమవారం కర్నూలుకు వచ్చిన సందర్బంగా కూటమి నేతలు బాలయ్యకు గజమాలతో సత్కరిస్తున్న దృశ్యం.

TDP: కర్నూలులో బాలకృష్ణ  స్వర్ణాంధ్ర సాకర యాత్ర దృశ్యాలు.. 3/6

స్వర్ణాంధ్ర సాకర యాత్రలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సోమవారం కర్నూలులో నిర్వహించిన రోడ్ షోలో ప్రసంగిస్తున్న దృశ్యం. ప్రక్కన టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి టీజీ భరత్, ఆయన తండ్రి టీజీ వెంకటేష్ తదితరులు..

TDP: కర్నూలులో బాలకృష్ణ  స్వర్ణాంధ్ర సాకర యాత్ర దృశ్యాలు.. 4/6

తనకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలకు నమస్కరిస్తూ విజ్జప్తి చేస్తు్న్న టీడీపీ పార్లమెంట్ అభ్యర్తి టీజీ భరత్.. ప్రక్కన నందమూరి బాలకృష్ణ...

TDP: కర్నూలులో బాలకృష్ణ  స్వర్ణాంధ్ర సాకర యాత్ర దృశ్యాలు.. 5/6

స్వర్ణాంధ్ర సాకర యాత్రలో భాగంగా సోమవారం కర్నూలుకు విచ్చేసిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ రోడ్ షోకు జనం నీరాజనం పలికుతున్న దృశ్యం.

TDP: కర్నూలులో బాలకృష్ణ  స్వర్ణాంధ్ర సాకర యాత్ర దృశ్యాలు.. 6/6

ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సోమవారం కర్నూలులో నిర్వహించిన రోడ్ షో, సభకు భారీగా తరలి వచ్చిన జనం..

Updated at - Apr 16 , 2024 | 09:27 AM