PM Narendra Modi: దాదాగిరి నుంచి ఇంట్లో గొడవల దాకా.. మహిళలతో ప్రధాని మోదీ చిట్‌చాట్

ABN, Publish Date - Feb 24 , 2024 | 06:57 PM

తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో శుక్రవారం పర్యటించిన సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోదీ స్థానికంగా పాల వ్యాపారం సాగిస్తున్న కొంతమంది మహిళలతో ముచ్చటించారు.

PM Narendra Modi: దాదాగిరి నుంచి ఇంట్లో గొడవల దాకా.. మహిళలతో ప్రధాని మోదీ చిట్‌చాట్ 1/6

తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో శుక్రవారం పర్యటించిన సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోదీ స్థానికంగా పాల వ్యాపారం సాగిస్తున్న కొంతమంది మహిళలతో ముచ్చటించారు. రెండు, మూడేళ్ల క్రితం గుజరాత్ నుంచి గిర్ జాతి ఆవులను ఆ మహిళలకు అందించగా.. పశువుల పోషణ, వాటి వల్ల ఆర్థికంగా చేకూరుతున్న ప్రయోజనాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.

PM Narendra Modi: దాదాగిరి నుంచి ఇంట్లో గొడవల దాకా.. మహిళలతో ప్రధాని మోదీ చిట్‌చాట్ 2/6

ఈ సందర్భంగా.. గిర్‌ ఆవుల పెంపకంతో తమ కుటుంబ ఆదాయం పెరిగిందని, తాము స్వావలంబన కూడా సాధించామని మహిళలు ప్రధాని మోదీకి చెప్పారు. ఈ ఆవులు తమ కుటుంబంలో భాగమయ్యాయని తెలిపారు. అందుకు మోదీ స్పందిస్తూ.. ‘‘అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం, గిర్ ఆవులు’’ అని చెప్పుకొచ్చారు.

PM Narendra Modi: దాదాగిరి నుంచి ఇంట్లో గొడవల దాకా.. మహిళలతో ప్రధాని మోదీ చిట్‌చాట్ 3/6

ఇంకా మోదీ మాట్లాడుతూ.. పాల ద్వారా వచ్చే ఆదాయాన్ని మహిళల ఖాతాలోనే జమ చేయాలన్నది తమ ఆలోచన అని అన్నారు. ‘‘మీకు ఇప్పుడు ఆదాయం వస్తోంది కదా.. ఇంట్లో మీరు దాదాగిరి చేస్తున్నారా? దీని వల్ల మీ ఇంట్లో గొడవ జరిగితే మాత్రం.. మోదీ వల్లే జరిగిందని అనకూడదు’’ అంటూ మోదీ ఛలోక్తులు పేల్చారు.

PM Narendra Modi: దాదాగిరి నుంచి ఇంట్లో గొడవల దాకా.. మహిళలతో ప్రధాని మోదీ చిట్‌చాట్ 4/6

ఈ గిర్ జాతి ఆవులు మనల్ని స్వావలంబనగా మార్చడమే కాదు, మన సంస్కృతిని కూడా ముందుకు తీసుకెళ్తున్నాయని మహిళలతో ప్రధాని మోదీ అన్నారు. ‘ఇంతకీ మీరు ఆవులతో సెల్ఫీ తీసుకున్నారా?’ అని మోదీ ప్రశ్నించగా.. ఆ పని తాము ఎప్పుడో చేసేశామంటూ మహిళలు ఎంతో ఉత్సాహంగా బదులిచ్చారు.

PM Narendra Modi: దాదాగిరి నుంచి ఇంట్లో గొడవల దాకా.. మహిళలతో ప్రధాని మోదీ చిట్‌చాట్ 5/6

ఈ విధంగా మహిళలతో సంభాషించిన దృశ్యాలను ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. మహిళా శక్తి సాధికారతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. గిర్ ఆవులు వచ్చాకి వారణాసి తల్లులు, సోదరీమణుల జీవితాలు మారాయని తెలిసి ఎంతో సంతృప్తిగా ఉందని తన ఎక్స్ ఖాతాలో మోదీ రాసుకొచ్చారు.

PM Narendra Modi: దాదాగిరి నుంచి ఇంట్లో గొడవల దాకా.. మహిళలతో ప్రధాని మోదీ చిట్‌చాట్ 6/6

కాగా.. గిర్ ఆవులు మేలు జాతి రకమైనవి. గుజరాత్‌కి చెందిన ఈ ఆవులు భారత్‌తో పాటు అమెరికా, మెక్సికో వంటి దేశాల్లోనూ ప్రసిద్ధి చెందాయి. ‘రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌’ కింద కేంద్ర ప్రభుత్వం వీటిని దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కొంతమంది మహిళలకు అందిస్తోంది. ఇవి గిర్ అడవికి చెందినవి కావడంతో, వాటికి ఆ పేరు వచ్చింది.

Updated at - Mar 01 , 2024 | 07:43 AM