Share News

Viral Video: పిల్ల చేష్టలంటే ఇవే.. స్కూటీపై వెళ్తున్న ముగ్గురు.. మధ్యలో కూర్చున్న బాలుడి తుంటరి పనికి..

ABN , Publish Date - Apr 14 , 2024 | 05:42 PM

ప్రస్తుత యువతలో కొంతమంది తమ టాలెంట్‌కి పదును పెట్టి లక్ష్య సాధనలో దూసుకెళ్తున్నారు. మరికొందరు పిచ్చి పిచ్చి పనులు చేసి వారు ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలో పడేస్తుంటారు. ఇంకొందరు సోషల్ మీడియాలో..

Viral Video: పిల్ల చేష్టలంటే ఇవే.. స్కూటీపై వెళ్తున్న ముగ్గురు.. మధ్యలో కూర్చున్న బాలుడి తుంటరి పనికి..

ప్రస్తుత యువతలో కొంతమంది తమ టాలెంట్‌కి పదును పెట్టి లక్ష్య సాధనలో దూసుకెళ్తున్నారు. మరికొందరు పిచ్చి పిచ్చి పనులు చేసి వారు ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలో పడేస్తుంటారు. ఇంకొందరు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ఎలాంటి పనులు చేయడానికైనా వెనుకాడరు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. స్కూటీపై వెళ్తున్న ముగ్గురిలో... మధ్యలో కూర్చున్న బాలుడు చేసిన తుంటరి పనికి చివరికి ఏం జరిగిందో చూడండి..

ఢిల్లీ పోలీసులు (Delhi Police) షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ స్కూటీపై (Scooty) ముగ్గురు బాలురు వెళ్తుంటారు. వాహనం వేగం అందుకున్నాక.. వారిలో మధ్యలో ఉన్న వ్యక్తి కారణంగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఉన్నట్టుండి అతను వెనుక ఉన్న తన స్నేహితుడిని చేత్తో పైకి ఎత్తి రోడ్డుపై పడేస్తాడు. ఊహించని ఈ ఘటనతో షాక్ అయిన అతను.. కిందపడబోతూ అతడి చేతులు పట్టుకోబోతాడు. అయితే అప్పటికే అతను పూర్తిగా రోడ్డుపై పడబోయే పరిస్థితిలో ఉంటాడు. చివరకు ధబేల్‌మని రోడ్డుపై పడిపోతాడు.

Viral: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక.. సడన్‌గా లోపలికి వచ్చిన కోతులు. చివరకు ఆమెకు వచ్చిన ఐడియాతో..

అతను కింద పడిపోవడాన్ని చూసి మిగతా ఇద్దరూ నవ్వుకుంటూ బండిని ఆపకుండానే వెళ్లిపోతారు. ఈ ఘటన మొత్తం మరో వాహనంలో వెళ్తున్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ అవడంతో చివరకు ఢిల్లీ పోలీసుల వరకూ వెళ్లింది. ఆ వీడియోను తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. పాపం..! ఇది దారుణం’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 52 వేలకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది.

Viral Video: కొంపతీసి ఇది కొత్త ట్రెండ్ కాదు కదా.. సెలూన్ షాప్‌లో ఈమె చేస్తున్న పని చూడండి..

Updated Date - Apr 14 , 2024 | 05:42 PM