Share News

Viral Video: ఇది చిరుతపులా లేక సీఐడీ ఆఫీసరా.. చెట్టు కొమ్మపై కాలి గోర్లతో..

ABN , Publish Date - Apr 19 , 2024 | 06:40 PM

సోషల్ మీడియాలో పులులు, సింహాలకు సంబంధించిన అనేక వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వేటాడే పులులు కొన్నిసార్లు విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. మరికొన్నిసార్లు చెట్టుపై ఉన్న జంతువులను కూడా వేటాడటం చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...

Viral Video: ఇది చిరుతపులా లేక సీఐడీ ఆఫీసరా.. చెట్టు కొమ్మపై కాలి గోర్లతో..

సోషల్ మీడియాలో పులులు, సింహాలకు సంబంధించిన అనేక వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వేటాడే పులులు కొన్నిసార్లు విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. మరికొన్నిసార్లు చెట్టుపై ఉన్న జంతువులను కూడా వేటాడటం చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ పులి విచిత్ర ప్రవర్తనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ చిరుత పులి చెట్టు కొమ్మపై ప్రవర్తించిన తీరు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ ఇది చిరుతపులా.. లేక సీఐడీ ఆఫీసరా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) వైరల్ అవుతోంది. రాజస్థాన్‌లోని (Rajasthan) రణతంబోర్ నేషనల్ పార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎందుకు ఎక్కిందో ఏమో గానీ.. ఓ చిరుతపులి (leopard) ఏకంగా ఓ పెద్ద చెట్టు ఎక్కింది. అక్కడ ఎలాంటి వేట లేకున్నా.. కొమ్మపై అటూ ఇటూ తిరుగుతూ ఏదో వెతుకుతున్నట్లుగా పరిశీలించింది. తర్వాత కొమ్మ చివరకు వెళ్లి.. చెట్టుపై కాలి గోర్లతో పైకి, కిందకు ఒత్తిడి చేస్తూ గీతలు పెడుతుంది.

Viral Video: ఇదెలా సాధ్యం..! బండ రాయి కింద లంకెబిందె.. తెరచిచూడగా..

ఇలా చాలా సార్లు చేసిన తర్వాత కొమ్మపై పడుకుని నేలపైకి చూస్తూ గమనిస్తుంది. ఈ ఘటనను చెట్టు కింద ఉన్న పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ చిరుత.. సీఐడీ ఆఫీసర్‌లా ఉందే’’.. అంటూ కొందరు, వివిధ రకాల ఎమోజీలతో మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: టికెట్ తీసుకున్న వ్యక్తిని బోగీలోకి రాకుండా తలుపులు వేశారు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..

Updated Date - Apr 19 , 2024 | 06:41 PM