Share News

Viral: ఈ మహిళకు చేతులెత్తి మొక్కాల్సిందే! ఇద్దరు పిల్లల తండ్రి కష్టం చూసి తట్టుకోలేక..

ABN , Publish Date - Apr 15 , 2024 | 07:47 PM

ముఖపరిచయం కూడా లేని క్యాన్సర్ బాధితుడికి తన కిడ్నీ దానం చేసిన ఓ అమెరికా మహిళ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: ఈ మహిళకు చేతులెత్తి మొక్కాల్సిందే! ఇద్దరు పిల్లల తండ్రి కష్టం చూసి తట్టుకోలేక..

ఇంటర్నెట్ డెస్క్: స్నేహితులు, బంధువులు ఇబ్బందుల్లో ఉన్నా కన్నెత్తి కూడా చూడని స్వార్థపరులున్న సమాజంలో ఓ మహిళ.. ప్రాణాపాయంలో ఉన్న అపరిచిత వ్యక్తికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. ముంచుకొస్తున్న పెనుప్రమాదం నుంచి అతడిని గట్టెక్కించింది. ఆమె తన భర్తను ఎలా కాపాడిందీ చెబుతూ బాధితుడి భార్య పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

అమెరికాలో (USA) ఈ ఘటన వెలుగు చూసింది. కెంటకీ రాష్ట్రానికి (Kentucky) చెందిన 29 ఏళ్ల ఛేజ్ కూపర్‌ వివాహితుడు. అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఎంతో జీవితం చూడాల్సిన అతడు దురదృష్టవశాత్తూ కిడ్నీ క్యాన్సర్ బారినపడ్డాడు. క్యాన్సర్ నాలుగో స్టేజ్‌కు చేరడంతో ఛేజ్ ప్రాణమే ప్రమాదంలో పడింది. కొత్త కిడ్నీ కోసం ప్రభుత్వ రిజిస్టర్‌లో వారు పేరు నమోదు చేసుకున్నా డోనర్ దొరికేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో ఛేజ్ భార్య తల్లడిల్లిపోయింది. భర్తను ఎలాగైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో చివరి ప్రయత్నంగా అతడి గురించి ఫేస్‌బుక్‌లో పంచుకుంది. దయ ఉన్న మానవతామూర్తులెవరైనా కిడ్నీ డోనెషన్‌కు ముందుకొచ్చిన తన కుటుంబాన్ని కాపాడాలని అభ్యర్థించింది.

2.jpgViral: ఇతడు నాగు పామును ఎలా బంధించాడో చూడండి.. ఈ ట్రిక్ ఎక్కడా చూసుండరు!


ఏ భగవంతుడో ఛేజ్ భార్య ప్రార్థనను ఆలకించడంతో హానా డర్బిన్ అనే మహిళ నేనున్నానంటూ ముందుకొచ్చింది. ఛేజ్‌తో ముఖపరిచయం కూడా లేకపోయినా అతడికి కిడ్నీ దానం చేసింది. ఆమె గొప్ప మనసు కారణంగా ఛేజ్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు (Selfless stranger donates kidney saves 29 year old father of two).

భర్త తనకు దక్కినందుకు పొంగిపోయిన ఛేజ్ భార్య సోషల్ మీడియా వేదికగా హానాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపింది. తమ కుటుంబం హానాకు ఎంతగా రుణపడి ఉందో మాటల్లో చెప్పలేమని వ్యాఖ్యానించింది. భగవంతుడిపై అమితవిశ్వాసమున్న హానా తమను ఆదుకునేందుకు ముందుకొచ్చిందని ఛేజ్ భార్య తెలిపింది. ఇక హానా తమకు ఎంత మాత్రం అపరిచితురాలు కాదని, తమ కుటుంబసభ్యురాలని వ్యాఖ్యానించింది. ఈ కథనం నెట్టింట ఎంతో మందిని కదిలించింది. ఈ కాలంలోనూ ఇలాంటోళ్లు ఉన్నారని తెలిసి తమకు మానవత్వంపై పోయిన నమ్మకం తిరిగొచ్చిందని అనేక మంది కామెంట్ చేశారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 15 , 2024 | 08:02 PM