Share News

Google: Pixel 8a స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్

ABN , Publish Date - Apr 14 , 2024 | 11:45 AM

గూగుల్ కొత్త స్మార్ట్‌ఫోన్ Google Pixel 8a వచ్చే నెలలో లాంచ్ కానుంది. అయితే దీని లాంచ్‌కు ముందే కొన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి. ఈ సందర్భంగా లీకైన డిజైన్, ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫోన్‌ను మే 14న జరిగే Google I/O 2024 ఈవెంట్‌లో లాంచ్ చేయనున్నారు.

Google: Pixel 8a స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్
Google Pixel 8a smartphone features leaked

గూగుల్ కొత్త స్మార్ట్‌ఫోన్ Google Pixel 8a వచ్చే నెలలో లాంచ్ కానుంది. అయితే దీని లాంచ్‌కు ముందే కొన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి. ఈ సందర్భంగా లీకైన డిజైన్, ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫోన్‌ను మే 14న జరిగే Google I/O 2024 ఈవెంట్‌లో లాంచ్ చేయనున్నారు. ఈ క్రమంలో Google Pixel 8aకు సంబంధించిన మోడల్ కలర్ ఎంపిక చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో బ్లూ, గ్రీన్, నలుపు, తెలుగు రంగులు ఉన్నాయి. ఈ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది.


ఈ ఫోన్ 5000mAh బ్యాటరీ, 27W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో లభించనుంది. డిస్ప్లే గురించి మాట్లాడితే నివేదికల ప్రకారం ఈ ఫోన్ 1080x2400 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.1 అంగుళాల పూర్తి HD+ OLED ప్యానెల్‌తో రానుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేయనుంది. కంపెనీ తన Tensor G3 చిప్‌సెట్‌తో Pixel 8aని ప్రారంభించవచ్చు. ఈ చిప్‌సెట్ గతంలో పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రోలో కనిపించింది. OS విషయానికి వస్తే ఈ ఫోన్ Android 14లో పని చేస్తుంది.


ఇది కూడా చదవండి:

Hyd to Goa: కేవలం రూ.425తోనే గోవా ట్రిప్.. ఇది మీకు తెలుసా?

Credit Card: క్రెడిట్ కార్డ్‌ ఉపయోగం వల్ల 10 లాభాలు.. అవి ఏంటంటే

మరిన్ని సాంకేతిక వార్తల కోసం

Updated Date - Apr 14 , 2024 | 11:55 AM