Share News

ఫిర్యాదులు, దరఖాస్తులపై తక్షణమే స్పందించాలి

ABN , Publish Date - Apr 26 , 2024 | 10:03 PM

పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలోని జిల్లాలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల సంబంధిత ఫిర్యాదులు, దరఖాస్తులపై తక్షణమే స్పందించాలని ఎన్నికల ఖర్చుల పరిశీలకులు సమీర్‌ నైరంతర్య అన్నారు.

ఫిర్యాదులు, దరఖాస్తులపై తక్షణమే స్పందించాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 26 : పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలోని జిల్లాలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల సంబంధిత ఫిర్యాదులు, దరఖాస్తులపై తక్షణమే స్పందించాలని ఎన్నికల ఖర్చుల పరిశీలకులు సమీర్‌ నైరంతర్య అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, అదనపు కలెక్టర్‌రాహుల్‌, ఆర్డీవో రాములు, ప్రత్యేక ఉప పాలన అధికారి చంద్రకళతో కలిసి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌, సి విజిల్‌, వీడియో పరిశీలన, వెబ్‌ కాస్టింగ్‌, మీడియా సెంటర్‌లను తనిఖీ చేశారు. రికార్డులను, రిజిష్టర్‌లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మే 13న పోలింగ్‌, జూన్‌ 4న కౌంటింగ్‌ ఉంటుందని, జూన్‌ 6 వరకు ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమలులో ఉంటుందన్నారు. ఎన్నికల ఫిర్యాదులను వెంటనే పరిష్కరిం చాలన్నారు. రాజకీయ పార్టీల ప్రకటనల దర ఖాస్తులను పరిశీలించి సకాలంలో అనుమతులు ఇవ్వాలన్నారు. సహాయ కార్మిక శాఖ కమిషనర్‌ వినీత, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 10:03 PM