Share News

పుస్తక పఠనంతో మరింత విజ్ఞానం

ABN , Publish Date - Apr 23 , 2024 | 10:50 PM

పుస్తక పఠనంతో విద్యార్థులు మరింత విజ్ఞానం పొందవచ్చని లక్షెట్టిపేట ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గఫార్‌ అన్నారు. తాని మడుగు జీపి పరిదిలోని బేహరన్‌గూడలో సావిత్రి బాయిఫూలే గ్రంఽథాలయాన్ని గ్రామ పటేల్‌, గిరిజను లతో కలిసి ప్రారంభించారు.

పుస్తక పఠనంతో మరింత విజ్ఞానం

దండేపల్లి, ఏప్రిల్‌ 23: పుస్తక పఠనంతో విద్యార్థులు మరింత విజ్ఞానం పొందవచ్చని లక్షెట్టిపేట ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గఫార్‌ అన్నారు. తాని మడుగు జీపి పరిదిలోని బేహరన్‌గూడలో సావిత్రి బాయిఫూలే గ్రంఽథాలయాన్ని గ్రామ పటేల్‌, గిరిజను లతో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్ధుల భవిష్యత్తుకు గ్రంథాలయం ఎంతో ఉపయో గమనిన్నారు. గిరిజన విద్యార్థులు వేసవి సెలవుల్లో గ్రంథాలయం ఉపయోగించుకొని విజ్ఞానాన్ని పెంచుకో వాలన్నారు. ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

కోటపల్లి: ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని పురస్కరిం చుకుని బావనపల్లి ప్రాథమిక పాఠశాలలో పుస్తక ప్రద ర్శన నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు బొలిశెట్టి బుచ్చన్న పుస్తకాల ప్రాముఖ్యతను వివరిస్తూ ఒక మంచి పుస్తకం వంద మంది మిత్రులతో సమానమని విద్యార్థులకు తెలిపారు. చిన్న నాటి నుంచే పుస్తక పఠ నం అలవాటు చేసుకోవాలన్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు.

Updated Date - Apr 23 , 2024 | 10:50 PM