Share News

విత్తన సంపదకు కేరాఫ్‌ ‘డీడీఎస్‌’

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:23 PM

జహీరాబాద్‌, ఏప్రిల్‌ 26: విత్తన సంపదకు కేరాఫ్‌ గా డెక్కన్‌ డెవల్‌పమెంట్‌ సొసైటీ(డీడీఎస్‌) నిలిచిందని పలువురు మహిళా రైతులు, విత్తన సంరక్షకులు మొగులమ్మ, నర్సమ్మ, తదితరులు పేర్కొన్నారు. శు

విత్తన సంపదకు కేరాఫ్‌ ‘డీడీఎస్‌’
విత్తన సంరక్షకులు తీసుకొచ్చిన విత్తనాలను ప్రదర్శిస్తున్న దృశ్యం

జహీరాబాద్‌, ఏప్రిల్‌ 26: విత్తన సంపదకు కేరాఫ్‌ గా డెక్కన్‌ డెవల్‌పమెంట్‌ సొసైటీ(డీడీఎస్‌) నిలిచిందని పలువురు మహిళా రైతులు, విత్తన సంరక్షకులు మొగులమ్మ, నర్సమ్మ, తదితరులు పేర్కొన్నారు. శుక్రవారం పస్తాపూర్‌లోని డీడీఎస్‌ కార్యాలయ ఆవరణలో డీడీఎస్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ విత్తన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డీడీఎస్‌ పరిధిలోని మహిళా రైతులు, విత్తన సంరక్షకులు 80 రకాల విత్తనాలను తీసుకొచ్చి ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు విత్తనాల సంరక్షణ, వాటి ప్రాధాన్యం గురించి వివరించారు. విత్తనాలకు, మహిళలకు దగ్గర సంబంధం ఉంటుందని గుర్తు చేశారు. డీడీఏస్‌ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు మహిళా రైతులు సంఘటితమై విత్తనాలను సంరక్షించామని వివరించారు. డీడీఎస్‌ మహిళారైతుల వద్ద నేటికైన సుమారు 80కి పైచిలుకుగానే విత్తనాలున్నాయన్నారు. రైతులందరు పాతపంటలను పండించాలని, వాటిని తినడం మూలంగా ఆరోగ్యంగా ఉంటామనే విషయాన్ని ప్రతిఒక్కరు గమనించాలన్నారు. ప్రస్థుతం పల్లెల్లోను, పట్టణాల్లోను చిరుధాన్యాల వినియోగం ఎక్కువ కావడంతో వాటికి మార్కెట్లో డిమాండ్‌ పెరిగిందన్నారు. మార్కెట్‌ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని రైతులు తమకున్న పొలంలో కొంతలో కొంతనైన చిరుధాన్యాలను సాగుచేయాలని వారు కోరారు. ఎర్రపెసరి, నల్లతొగరి, బుర్కతొగరి, పచ్చశనగలు, నల్లబెబ్బరి తదితర పంటలను మునిగిపోతున్నాయని, వాటన్నింటిని డీడీఎస్‌ మహిళారైతులు పొలాల్లో సాగుచేస్తున్నారన్నారు. రైతులు వారి వారి పొలాల్లో ఒకేరకమైన పంటలను వేయడం వల్ల నష్టపోతున్నారని, పంటమార్పిడి విధానాన్ని తప్పకుండ పాటించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా రైతులు, విత్తన సంరక్ష కులు, డీడీఎస్‌ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:23 PM