Share News

బీజేపీ, బీఆర్‌ఎస్‌లను ఓడించాలి

ABN , Publish Date - May 07 , 2024 | 12:06 AM

బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలను ప్రజలు నమ్మొద్దని, ఆ పార్టీ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. సోమవారం బషీరాబాద్‌ మండలం రెడ్డిఘణాపూర్‌, మంతట్టి, కంసాన్‌పల్లి, పర్వత్‌పల్లి, మర్పల్లి, నీళ్లపల్లి, జలాల్‌పూర్‌, ఇస్మాయిల్‌పూర్‌, ఇందర్‌చెడ్‌, నవాంద్గీ, గంగ్వార్‌, క్యాద్గీరా, జీవన్గి గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌లను ఓడించాలి
బషీరాబాద్‌ : ప్రచారంలో మట్లాడుతున్న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి

బషీరాబాద్‌, మే 6: బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలను ప్రజలు నమ్మొద్దని, ఆ పార్టీ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. సోమవారం బషీరాబాద్‌ మండలం రెడ్డిఘణాపూర్‌, మంతట్టి, కంసాన్‌పల్లి, పర్వత్‌పల్లి, మర్పల్లి, నీళ్లపల్లి, జలాల్‌పూర్‌, ఇస్మాయిల్‌పూర్‌, ఇందర్‌చెడ్‌, నవాంద్గీ, గంగ్వార్‌, క్యాద్గీరా, జీవన్గి గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే మట్లాడుతూ బీజీపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని, అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌.. బీజేపీతో కుమ్మక్కై నాయకులు ఓట్ల కోసం తిగుతున్నారని విమర్శించారు. అంతకుముందు నీళ్లపల్లిలో ఎమ్మెల్యే, ఆర్‌టీఐ మాజీ కమిషనర్‌ లక్ష్మణ్‌నాయక్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తండాల అభివృద్ధి కాంగ్రె్‌సతోనే సాధ్యమని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. తాండూరు నియోజక వర్గంలో సుమారు 130 తండాలు ఉన్నాయని, గిరిజనులు కాంగ్రె్‌సకు సంపూర్ణ మద్ధతు తెలుపుతున్నారని లక్ష్మణ్‌నాయక్‌ తెలిపారు. జడ్పీటీసీ శ్రీనివా్‌సరెడ్డి, నవాంద్గీ పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ అజయ్‌ప్రసాద్‌, ఎమ్మెల్యే సోదరుడు సత్యనారాయణరెడ్డి, తదితరులున్నారు.

రంజిత్‌రెడ్డి గెలుపు ఖాయం

నవాబుపేట/చేవెళ్ల : చేవెళ్ల నుంచి రంజిత్‌రెడ్డి గెలుపు ఖాయమని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పామెన భీమ్‌భరత్‌ అన్నారు. నవాబుపేట మండల కేంద్రంలోని లింగంపల్లి లక్ష్మారెడ్డి గార్డెన్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సి.సత్యనారాయణరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, తదితరులున్నారు. ఐదేళ్లకోసారి రాజకీయ పార్టీలు ఇచ్చే ప్యాకేజీలకు అమ్ముడుపోయే చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం చరిత్ర చేవెళ్ల ప్రజలందరికీ తెలుసునని భీంభరత్‌ అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రంజిత్‌రెడ్డిపై అవాస్తవాలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటేనని, ఎన్నికల్లో ఎమ్మెల్యే యాదయ్య బీజేపీకి అమ్ముడుపోయాడని, దమ్ముంటే కాసానిని గెలిపించుకోవాలని సవాల్‌ విసిరారు.

కాంగ్రెస్‌కు సీపీఐ మద్దతు : విజయలక్ష్మీ పండిట్‌

తాండూరు/బంట్వారం (కోట్‌పల్లి)/దోమ మే 6: ఇండియా కూటమిలో భాగ ంగా సీపీఐ రంజిత్‌రెడ్డికి పూర్తి మద్దతు ఇస్తుందని జిల్లా కార్యదర్శి , మాజీ కౌన్సిలర్‌ విజయలక్ష్మీ పండిట్‌ తెలిపారు. తాండూరులో సీపీఐ ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ సీపీఐ పొత్తు ఉండి మద్దతు తెలిపినట్లు గుర్తుచేశారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మునీర్‌ అహ్మద్‌, మాజీ కౌన్సిలర్లు లుక్‌మాల్‌ హుస్సేనీ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రవీందర్‌, మహిళ సమాఖ్య నాయకురాలు నష్మాబేగం, తదితరులున్నారు. కాగా, ప్రచారంలో భాగంగా కౌన్సిలర్‌ విజయదేవి, మాజీ కౌన్సిలర్‌ సర్ధార్‌ఖాన్‌ రంజిత్‌రెడ్డి తరఫున ప్రచారం చేశారు. రంజిత్‌రెడ్డి గెలుపుకోసం కృషి చేస్తామని బంట్వారం మండలాధ్యక్షుడు వెంకటేశం అన్నారు. వికారాబాద్‌లో ఆయన సమక్షంలో యాచారం మాజీ సర్పంచ్‌ బల్వంత్‌రెడ్డి అనుచరులు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలో చేరారు. అనంతరం స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ను కలిశారు. బొంపల్లిలో రిటైర్డ్‌ ఏఎ్‌సఐ అంతిరెడ్డి, నాయకులు చంద్రశేఖర్‌ ప్రచారం చేశారు.

కాంగ్రెస్‌ను గెలిపించుకుందాం

ధారూరు : చేవెళ్ల నుంచి కాంగ్రె్‌సను గెలిపించుకుని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని పీసీసీ ప్రధాన కార్యదర్శి పి. రఘువీరారెడ్డి తెలిపారు. ధారూరు పరిధిలోని తరిగోపుల, మున్నూర్‌సోమారంలో స్పీకర్‌ తనయ అనన్య చేతన్‌, రంజిత్‌రెడ్డి తనయుడు సిద్థార్థరెడ్డిలతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. రంజిత్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మండలాధ్యక్షుడు విజయబాస్కర్‌రెడ్డి, నాయకులు తదితరులున్నారు. ధారూరు మండం నాగారంనకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు రాజేందర్‌రెడ్డి కాంగ్రె్‌సలో చేరారు. వికారాబాద్‌ పట్టణంలో స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ కండువా కప్పి ఆహ్వానించారు. నాయకులు మహిపాల్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి ఉన్నారు.

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం

కులకచర్ల : కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని డీసీసీ ఉపాధ్యక్షుడు భీమ్‌రెడ్డి అన్నారు. కులకచర్ల మండలంలోని చాపలగూడెంలో ప్రచారం చేశారు. పరిగి బ్లాక్‌బీ అధ్యక్షుడు భరత్‌కుమార్‌, నాయకులు వెంకటయ్యగౌడ్‌, కుమ్మరి స్వామి తదితరులు పాల్గొన్నారు.

రంజిత్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా పని చేయాలి

కందుకూరు/చేవెళ్ల : లోక్‌సభ ఎన్నికల్లో రంజిత్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలను ఓటర్లకు క్లుప్తంగా వివరించాలని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి అన్నారు. కందుకూరు మండలంలోని బైరాగూడలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. నాయకులు చాడ లోకేందర్‌రెడ్డి, డిల్లీ శ్రీధర్‌, అనేగౌని పాండుగౌడ్‌, పొట్ట కుమార్‌, బాలమల్లే్‌షయాదవ్‌, సుధాకర్‌, పి.ప్రేమలమ్మ, వినోద, రవీందర్‌, జంగమ్మ తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఎంపీగా రంజిత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎన్నికల స్టార్‌ క్యాంపెయినర్‌ సున్నపు వసంతం, డీసీసీ ఉపాధ్యక్షుడు ఆగిరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్లు వెంకట్‌రెడ్డి, ప్రతా్‌పరెడ్డి, ఎన్కెపల్లి ఎంపీటీసీ వనం మాధవి లక్ష్మికాంత్‌రెడ్డి తెలిపారు. చేవెళ్ల మండలం గొల్లగూడ, కేసారంలో ప్రచారం చేశారు.

Updated Date - May 07 , 2024 | 12:06 AM