Share News

ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులకు గురిచేయొద్దు

ABN , Publish Date - May 07 , 2024 | 12:04 AM

రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను దేశించారు.

ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులకు గురిచేయొద్దు

వికారాబాద్‌, మే 6(ఆంధ్రజ్యోతి) : రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను దేశించారు. సోమవారం పౌరసరఫరా శాఖ అధికారులు, తహసీల్దార్లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లకు ఇప్పటికే కేంద్రాలను ప్రారంభించామని, కొన్న ధాన్యాన్ని ఓపీఎంఎ్‌సలో నమోదు చేసి సంబంధిత మిల్లులకు తరలించాలన్నారు. ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టర్లు అవసరమైనన్ని వాహనాలను అందుబాటులో ఉంచాలని, వచ్చిన ధాన్యాన్ని రైస్‌ మిల్లర్లు వెంటనే అన్‌లోడ్‌ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాక్‌షీట్‌ జనరేట్‌ చేసి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలన్నారు. వర్షాలు కురిస్తే వడ్లు తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. రోజూ ప్రొక్యూర్‌మెంట్‌ ఏజెన్సీలు తమ ఇన్‌చార్జిలతో సమన్వయం చేసుకొని రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌, డీఆర్డీవో శ్రీనివాస్‌, డీఎస్వో రాజేశ్వర్‌, సివిల్‌ సప్లయీస్‌ డీఎం సుగుణబాయి, డీసీవో ఈశ్వరయ్య, పాండురంగం పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2024 | 12:04 AM