Share News

అనుమానం పెనుభూతమై..

ABN , Publish Date - May 07 , 2024 | 12:02 AM

అనుమానం పెనుభూతమై.. భర్త కాలయముడై భార్యను అతి కిరాతకంగా చంపాడు. శంకర్‌పల్లి మండలం మిర్జాగూడ అనుబంధ గ్రామం ఇంద్రారెడ్డినగర్‌లో వడ్డె మాణిక్యం, యాదమ్మ దంపతులు కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు.

అనుమానం పెనుభూతమై..

భార్యను చంపిన భర్త

మొయినాబాద్‌ రూరల్‌, మే 6 : అనుమానం పెనుభూతమై.. భర్త కాలయముడై భార్యను అతి కిరాతకంగా చంపాడు. శంకర్‌పల్లి మండలం మిర్జాగూడ అనుబంధ గ్రామం ఇంద్రారెడ్డినగర్‌లో వడ్డె మాణిక్యం, యాదమ్మ దంపతులు కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. భర్త మాణిక్యంకు ఇటీవల కాలంలో యాదమ్మపై అనుమానం పెనుభూతంలా మారింది. అప్పటి నుంచి ఆమెను వేధిస్తుండేవాడు. ఈక్రమంలో ఆదివారం అర్ధరాత్రి యాదమ్మ ఇంటి ఆరుబయట నిద్రిస్తుండగా భర్త మాణిక్యం ఆమె తలపై గ్రానైట్‌ రాయితో గట్టిగా మోదాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో యాదమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. కాగా, వారి కూతురు ఆ సమయంలోనే ఇంట్లో నిద్రిస్తోంది. ఇద్దరు కుమారులు ఉండగా పెళ్లిళ్లు కావడంతో వేరే సంసారం పెట్టుకున్నారు. మోకిల సీఐ వీరబాబు, ఎస్సై కోటేశ్వరరావులు సోమవారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించి హత్య జరిగిన తీరును పరిశీలించి వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు చెప్పారు.

లైంగికదాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

షాద్‌నగర్‌ రూరల్‌, మే 6: బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించినట్లు ఇన్‌స్పెక్టర్‌ ప్రతా్‌పలింగం తెలిపారు. షాద్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని కాంసాన్‌పల్లికి చెందిన చాకలి యాదయ్య(45) 2023లో మైనర్‌పై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అప్పటి ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌కుమార్‌.. విచారణ చేసి నిందితుడిని రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. ప్రస్తుతం అతడు రిమాండ్‌లోనే ఉన్నాడు. షాద్‌నగర్‌ పోక్సో కోర్టులో సోమవారం వాదనలు జరగగా నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి జైలు శిక్ష, జరిమానా విధించినట్లు తెలిపారు. అలాగే బాధితురాలికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం కింద రూ.7లక్షలు అందించాలని ఆదేశించారు.

Updated Date - May 07 , 2024 | 12:02 AM