Share News

ముమ్మరంగా వాహనాల తనిఖీలు

ABN , Publish Date - May 07 , 2024 | 12:04 AM

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. సోమవారం మండల పరిధిలోని మాల్‌లో సీఐ శంకర్‌కుమార్‌, ఎస్సైలు వెంకటనారాయణ, గోపాల్‌, సత్యనారాయణలు స్పెషల్‌పార్టీ పోలీసులతో కలిసి వాహనాలు తనిఖీ చేశారు. యాచారం వెళుతున్న వాహనాలతో పాటు మాల్‌కు వస్తున్న వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించారు.

ముమ్మరంగా వాహనాల తనిఖీలు
యాచారం : మాల్‌ చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు

రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తరలిస్తే ఆధారాలు చూపాలి : పోలీసులు

యాచారం, మే 6 : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. సోమవారం మండల పరిధిలోని మాల్‌లో సీఐ శంకర్‌కుమార్‌, ఎస్సైలు వెంకటనారాయణ, గోపాల్‌, సత్యనారాయణలు స్పెషల్‌పార్టీ పోలీసులతో కలిసి వాహనాలు తనిఖీ చేశారు. యాచారం వెళుతున్న వాహనాలతో పాటు మాల్‌కు వస్తున్న వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించారు. ఈ సందర్భంగా లైసెన్స్‌ లేని డ్రైవర్లకు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. డ్రైవర్లు విధిగా తమ వెంట డ్రైవింగ్‌, పొల్యూషన్‌, ఆర్‌సీ, తదితర పత్రాలు ఉంచుకోవాలన్నారు. రూ.50వేల నగదు కంటే ఎక్కువ కలిగి ఉంటే తగిన ఆధారాలు పోలీసులకు చూపాలని, లేనిచో సీజ్‌ చేస్తామన్నారు. వ్యాపారులు తమ వస్తువులు ఎక్కడి నుంచి తెస్తున్నారో తెలియజేసే ఆధారాలు చూపించాలని కోరారు. తనిఖీ చేస్తున్న పోలీసులకు వాహనాదారులు సహకరించాలని కోరారు. ముఖ్యంగా మద్యం తాగి వాహనాలు నడపరాదని, బెల్టు దుకాణాలు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆటోల, క్రూయిజర్ల వాహనాదారులు అతివేగంగా నడపరాదని చెప్పారు.

Updated Date - May 07 , 2024 | 12:04 AM