Share News

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:18 AM

కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన శామీర్‌పేట్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

  • కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యమే కారణం

మూడుచింతలపల్లి, ఏప్రిల్‌ 26: కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన శామీర్‌పేట్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన లక్ష్మన్‌ మూసాపేట్‌లో ఉంటూ ఎలక్రిషన్‌గా కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజూవారి కూలిలాగే తూంకుంట మున్సిపాలిటీలోని అంతాయిపల్లి గ్రామపరిధిలోని జనచైతన్య వెంచర్‌లో మూడు రోజులుగా మిషన్‌ భగీరథ వాటర్‌ పైప్‌లైన్‌లో పనిచేస్తున్నాడు. ఒక ఎల్‌సీ ఫీడర్‌ నుంచి సప్లయి ఇవ్వాందిపోయి మరో ఎల్‌సీ ఫీడర్‌ నుంచి సప్లయి తీసుకోగా కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యానికి ప్రమాదవశాత్తు లక్ష్మణ్‌ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయమై శామీర్‌పేట్‌ ఏడీఈ రమణరెడ్డిని వివరణ కోరగా తనకేం తెలియదని, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని సమాధానమిచ్చారు.

Updated Date - Apr 27 , 2024 | 12:18 AM