Share News

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో వ్యక్తికి ఏడాది జైలు

ABN , Publish Date - May 07 , 2024 | 12:03 AM

కులం పేరుతో దూషించిన వ్యక్తికి ఏడాది కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 5వేల జరిమానా విధిస్తూ ఎల్‌ బీనగర్‌ కోర్టు న్యాయాధికారి భవాని తీర్పు వెలువరించారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో వ్యక్తికి ఏడాది జైలు

యాచారం, మే 6 : కులం పేరుతో దూషించిన వ్యక్తికి ఏడాది కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 5వేల జరిమానా విధిస్తూ ఎల్‌ బీనగర్‌ కోర్టు న్యాయాధికారి భవాని తీర్పు వెలువరించారు. సీఐ శంకర్‌కుమార్‌, కోర్టు సీడీవో భిక్షపతిల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎండీ హఫీజ్‌(30) అదే గ్రామానికి చెందిన తలారి యాదయ్యలు డబ్బు విషయంలో గొడవకు దిగారు. కోపోద్రిక్తుడైన ఎండీ హఫీజ్‌ యాదయ్యను కొట్టి కులం పేరుతో దూషించాడు. దాంతో యాదయ్య పోలీసులను ఆశ్రయించగా పోలీసులు 2006లో ఐపీసీ 323 కింద ఎస్సీ. ఎస్టీ కేసు నమోదు చేశారు. అప్పటి ఏసీపీ నారాయణ గ్రామంలో సమగ్రంగా విచారించి పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించారు. కేసు వివరాలను విచారించిన ఎల్‌ బీ నగర్‌ న్యాయాధికారి భవాని సోమవారం నిందితుడు ఎండీ హఫీజ్‌కు ఏడాది కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

Updated Date - May 07 , 2024 | 12:03 AM