Share News

నిప్పుల వర్షం!

ABN , Publish Date - May 07 , 2024 | 12:05 AM

ఉమ్మడి జిల్లాలో నిప్పుల వర్షం కురుస్తోంది. సూర్యుడి భగభగలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు.

నిప్పుల వర్షం!

భానుడి భగభగలతో ప్రజల విలవిల

నాగారంలో అత్యధికంగా 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత

రంగారెడ్డి అర్బన్‌/వికారాబాద్‌, ఆంధ్రజ్యోతి, మే 6: ఉమ్మడి జిల్లాలో నిప్పుల వర్షం కురుస్తోంది. సూర్యుడి భగభగలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉమ్మడి జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు చాలా చోట్ల 45 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. వడగాలులు వీస్తున్నాయి. మరో మూడు, నాలుగు రోజులు వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా. సోమవారం వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండలం నాగారంలో 45.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా మేడ్చల్‌ జిల్లా కీసరలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వికారాబాద్‌ జిల్లా కాశీంపూర్‌లో 44.5, తాండూరులో 44.15, దౌల్తాబాద్‌లో 44 డిగ్రీలు, వికారాబాద్‌లో 43.5, కోట్‌పల్లి, పెద్దేముల్‌లలో 43.3 డిగ్రీల చొప్పున, పెద్ద ఉమ్మెంతాల్‌లో 43.2, ధారూరు, మర్పల్లిల్లో 43.1డిగ్రీలు, పూడూరు మండలం మన్నెగూడలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. యాలాల్‌లో 42.9, దౌలాపూర్‌ 42.9, నవాబ్‌పేట్‌, ముజాహిద్‌పూర్‌లలో 42.8, దుద్యాల్‌లో 42.7, మో మిన్‌పేట్‌, కొడంగల్‌లలో 42.5, బషీరాబాద్‌లో42.4, ఏఆర్‌ఎ్‌సలో 42.3డిగ్రీలు, చౌడాపూర్‌లో 41.9 డిగ్రీలు, బొంరా్‌సపేట్‌లో 41.5, బొంరా్‌సపేట్‌లో 41.5, రాపోల్‌లో 41.3, మద్గుల్‌ చిట్టంపల్లిలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పరిగి, మదన్‌పల్లిలో 41.1, దోమలో 40.6 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - May 07 , 2024 | 12:05 AM