Share News

ముగిసిన నామినేషన్ల పరిశీలన

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:25 AM

చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల్లో మరో కీలక ఘట్టం ముగిసింది. అధికారులు నామినేషన్ల పరిశీలన పూర్తిచేశారు. సరైన ఫార్మాట్‌లో లేని నామినేషన్లను తిరస్కరించారు.

ముగిసిన నామినేషన్ల పరిశీలన

8 చేవెళ్లలో 17 నామినేషన్ల తిరస్కరణ 8 బరిలో 47 మంది

రంగారెడ్డి అర్బన్‌/మేడ్చల్‌, (ఆంధ్రజ్యోతి) ఏప్రిల్‌ 26 : చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల్లో మరో కీలక ఘట్టం ముగిసింది. అధికారులు నామినేషన్ల పరిశీలన పూర్తిచేశారు. సరైన ఫార్మాట్‌లో లేని నామినేషన్లను తిరస్కరించారు. దాంతో బరిలో నిలిచేది ఎవరో తేలిపోయింది. చేవెళ్ల పార్లమెంట్‌ స్థానానికి మొత్తం 64 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, పార్లమెంట్‌ స్థానానికి దాఖలైన నామినేషన్లలో 17 నామినేషన్లను తిరస్కరించారు. మిగిలిన 47 నామినేషన్లకు జిల్లా ఎన్నికల అధికారి శశాంక అమోదం తెలిపారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లకు ఓకే చెప్పారు. ఏప్రిల్‌ 29న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మే 13న పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు.

మల్కాజ్‌గిరిలో 77 నామినేషన్లు తిరస్కరణ

మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానానికి 114 మంది అభ్యర్థులు 177 నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా రిటర్నింగ్‌ అధికారి గౌతమ్‌ సరైన ఫార్మాట్‌ లేని 77 నామినేషన్లను తిరస్కరించారు. కాగా, 37 అభ్యర్థుల నామినేషన్లు మాత్రమే ఆమోదించినట్లు ఎన్నికల పరిశీలకులు డాక్టర్‌ రాజీవ్‌ శుక్లా తెలిపారు.

Updated Date - Apr 27 , 2024 | 12:25 AM