Share News

Bhadrachalam: సీతమ్మ మెడలో పుస్తె కట్టిన రామయ్య.. భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం కమనీయం

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:38 PM

Telangana: భద్రాద్రిలో శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీసీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. మూహూర్త సమయాన సీతమ్మ మెడలో రామయ్య పుస్తె కట్టడంతో కళ్యాణ క్రతువు పూర్తైంది. మిథులా స్టేడియంలోని మండపంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఉదయం రామాలయంలో మూలవరులకు మొదట కళ్యాణం జరిగింది. ఆపై ఉత్సవమూర్తులను ఆలయం నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా మిథులా కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు.

Bhadrachalam: సీతమ్మ మెడలో పుస్తె కట్టిన రామయ్య.. భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం కమనీయం
Sri sitaramula kalyanam

భద్రాచలం, ఏప్రిల్ 17: భద్రాద్రిలో శ్రీరామనవమి (Sriramanavami) శోభ సంతరించుకుంది. భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీసీతారాముల కళ్యాణోత్సవం (Sri Sitaramulua Kalyanam) కన్నుల పండువగా జరిగింది. మూహూర్త సమయాన సీతమ్మ మెడలో రామయ్య పుస్తె కట్టడంతో కళ్యాణ క్రతువు పూర్తైంది. మిథులా స్టేడియంలోని మండపంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఉదయం రామాలయంలో మూలవరులకు మొదట కళ్యాణం జరిగింది. ఆపై ఉత్సవమూర్తులను ఆలయం నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా మిథులా కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు నిర్వహించారు. ఉదయం 10:30 గంటలకు కళ్యాణోత్సవం ప్రారంభం అవగా.. అభిజిత్ లగ్నంలో సీతారామయ్యలకు రుత్వికులు జీలకర్ర బెల్లం పెట్టారు. ఆపై సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్యధారణ చేశారు.

Ayodhya: అయోధ్య రాముడి నుదట సూర్య తిలకం.. వీక్షించేందుకు తరలివస్తున్న భక్తులు


రామయ్య కళ్యాణాన్ని కనులారా వీక్షిస్తూ...

తరువాత తలంబ్రాల కార్యక్రమం జరిగింది. అనంతరం జరిగే కార్యక్రమాలను అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. ఈ వేడుకల్లో భాగంగా స్వామిఅమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పట్టువస్త్రాలను సమర్పించారు. కళ్యాణోత్సవారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు, రెవెన్యూ శాఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దంపతులు, మంత్రి కొండా సురేఖ, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు దంపతులు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దంపతులు హాజరయ్యారు. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టీస్ పి.ఎస్. నర్సింహా, హైకోర్ట్ జడ్జి భీమపాక నగేష్రా కళ్యాణంలో పాల్గొన్నారు. రామయ్య కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శ్రీరామనామస్మరణతో మిథులా స్టేడియం మారుమ్రోగింది. భక్తులంతా శ్రీరాముడి కళ్యాణాన్ని వీక్షిస్తూ పరవశించి పోయారు.

KCR: బాబోయ్.. కేసీఆర్ ఇంటివద్ద క్షుద్ర పూజలు..!


సీతారామచంద్రుల కళ్యాణం కోసం మిథిలా కళ్యాణ మండపంలో 24 సెక్టార్స్ ఏర్పాటు చేశారు. 31 వేల మంది భక్తులు కళ్యాణం వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. అలాగే 1800 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో ఉన్నారు. కాగా.. కళ్యాణోత్సవం సందర్భంగా మిథులా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ వేడుక కోసం ఆలయాన్ని అందంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణం మొత్తం విద్యుత్ దీపాలతో కళకళలాడుతోంది. రేపు(గురువారం) శ్రీ రామ పట్టాభిషేకం జరుగనుంది.


ఇవి కూడా చదవండి..

Hyderabad: కుస్తీ పోటీల్లో ఓడించాడని.. మద్యం మైకంలో..

Tulasireddy: జగన్ రెడ్డి కాదు - జలగ రెడ్డి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 17 , 2024 | 02:32 PM