Share News

మసాలా చాయ్‌... బాస్మతీలకు ఓటేశారు!

ABN , Publish Date - Feb 04 , 2024 | 10:44 AM

మసాలా చాయ్‌ కమ్మదనం ... బాస్మతి రైస్‌ ఘుమఘుమలు... మ్యాంగో లస్సీ తీయదనం... ఆహారప్రియులకు సుపరిచితమే....

మసాలా చాయ్‌... బాస్మతీలకు ఓటేశారు!

మసాలా చాయ్‌ కమ్మదనం ... బాస్మతి రైస్‌ ఘుమఘుమలు... మ్యాంగో లస్సీ తీయదనం... ఆహారప్రియులకు సుపరిచితమే. ఇప్పుడివే ఫుడ్‌ దునియాలో చర్చనీయాంశంగా మారాయి. ఫుడ్‌ అండ్‌ ట్రావెల్‌ గైడ్‌ ‘టేస్ట్‌ అట్లాస్‌’ ప్రతీ ఏడాది ప్రపంచంలోని టాప్‌ 100 ఫుడ్‌ డిష్‌ల జాబితాను విడుదల చేస్తుంది. ఇటీవల 2023-24 సంవత్సరానికిగానూ అత్యుత్తమ వంటకాలను ప్రకటించింది. అందులో మన దేశానికి చెందిన కొన్ని ఐకానిక్‌ వంటకాలు అగ్రస్థానంలో నిలిచి సత్తా చాటాయి. ఇంతకీ ఆ రుచులు ఏవంటే...

ప్రపంచంలోని అత్యుత్తమ రొట్టెల జాబితాలో ‘బటర్‌ గార్లిక్‌ నాన్‌’ మూడోస్థానాన్ని ఆక్రమించింది.

5.jpg

అత్యంత ప్రజాదరణ పొందిన నాన్‌ ఆల్కహాలిక్‌ పానీయాల జాబితాలో మన ‘మసాలా చాయ్‌’ రెండో స్థానాన్ని దక్కించుకుంది. మెక్సికోకు చెందిన ‘అగువాస్‌ ఫ్రెస్కాస్‌’ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. పండ్లు, పువ్వులు, కుకుంబర్‌, సీడ్స్‌, సిరిల్స్‌, షుగర్‌, నీటితో ఫ్రెస్కాస్‌ పానీయాన్ని తయారుచేస్తారు.

2.jpg

చికెన్‌లో ఎన్ని వెరైటీలు ఉన్నా ‘చికెన్‌ టిక్కా’కు ఉన్న క్రేజ్‌ వేరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్‌-10 ఉత్తమ చికెన్‌ డిష్‌లలో చికెన్‌ టిక్కాను కూడా చేర్చారు. బోన్‌లెస్‌ చికెన్‌ను పెరుగు, సాంప్రదాయిక మసాలా మిశ్రమంలో మారినేట్‌ చేయడం ద్వారా దీనిని తయారుచేస్తారు.

1.jpg

నాన్‌వెజ్‌ ప్రియులు ఇష్టంగా లాగించే వాటిల్లో ‘బటర్‌ చికెన్‌’ ఒకటి. అందుకే ఈ వంటకం ప్రపంచంలోని మొదటి పది ‘ఉత్తమ చికెన్‌’ వంట కాలలో స్థానం పొందింది. మొదటిగా ఈ వంటకాన్ని (1950 వ దశకంలో) ఢిల్లీలోని మోతీమహల్‌ రెస్టారెంట్‌లో తయారుచేశారు. అప్పటి నుంచి ఇది ప్రాచుర్యం పొందింది.

6.jpg

భారత్‌లో పండించే ‘బాస్మతి’ బియ్యం ప్రపంచంలోనే అత్యుత్తమ బియ్యంగా అరుదైన ఘనతను అందుకుంది. మన దేశంలో 34 రకాల బాస్మతి బియ్యాన్ని పండిస్తున్నారు. బాస్మతి తర్వాత రెండో స్థానంలో ఇటలీకి చెందిన అర్బోరియా, మూడో స్థానంలో పోర్చుగల్‌కు చెందిన కరోలినా బియ్యం నిలిచాయి.

4.jpg

వేసవి కాలంలో భారతీయులు ఇష్టంగా తాగే ‘మ్యాంగో లస్సీ’ ప్రపంచంలోనే బెస్ట్‌ ‘డెయిరీ డ్రింక్‌’ టైటిల్‌ను దక్కించుకుంది. తాజా మామిడిపండులో పెరుగు, పంచదార, యాలకులు కలిపి రుచి కరంగా దీన్ని తయారు చేస్తారు. ఈ జాబితాలో లస్సీ మూడో స్థానంలో, స్వీట్‌ లస్సీ ఐదో స్థానంలో నిలిచాయి.

Updated Date - Feb 04 , 2024 | 10:47 AM