పదకొండో పీఆర్సీ అమలు చేయాలి

ABN , First Publish Date - 2021-04-23T05:47:00+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కు పదకొండవ పీఆర్సీని వెంటనే అమలుచేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం అమలాపురం మండల పరిషత్‌ కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు.

పదకొండో పీఆర్సీ అమలు చేయాలి

 యూటీఎఫ్‌ మండల, పట్టణశాఖల ఆధ్వర్యంలో ధర్నా 

అమలాపురంరూరల్‌, ఏప్రిల్‌ 22: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కు పదకొండవ పీఆర్సీని వెంటనే అమలుచేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం అమలాపురం మండల పరిషత్‌ కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు. 55 శాతం ఫిట్‌ మెంట్‌తో 2018 జూలై 1 నుంచి పీఆర్సీని అమలుచేయాలని నినాదాలు చేశారు. యూటీఎఫ్‌ మండల, పట్టణశాఖల ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో రాష్ట్ర కౌన్సిలర్‌ పీఎస్‌ శిరోమణి, జిల్లా ఆడిట్‌ కమిటీసభ్యుడు పెన్నాడ శ్రీనివాసరావు, పి.చంద్రరావు, ఎన్‌వీ రమణ, డి.దుర్గారావు పాల్గొనిఎంపీడీవో ఎం.ప్రభాకరరావుకు వినతిపత్రం అందజేశారు.

 పి.గన్నవరం: పీఆర్‌సీని 2018 జూలై 1 నుంచి 55శాతం ఫిట్మేంట్‌ను వెంటనే అమలు చేయాలని యూటీఎఫ్‌ సంఘ ఉపాధ్యాయులు డిమాండ్‌ చేశారు. ఈసందర్భంగా రాష్ట్రకమిటీ పిలుపుమేరకు మండల పరిషత్‌ కార్యాలయం వద్ద సంఘ అధ్యక్షుడు కె.శివరామకృష్ణ అధ్యక్షతన నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీడీవో కె.వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందించారు. జిల్లా కార్యదర్శి కె.సురేష్‌కుమార్‌, గిడ్ల శ్రీనివాస్‌, పీఆర్‌కె సాయిబాబా, ఎం.సుందరరావు, వి.రత్నం, మల్లిఖార్జునరావు, కె.శ్రీనివాస్‌, జి.వెంకటలక్ష్మీ పాల్గొన్నారు.

మామిడికుదురు: పీఆర్సీ కమిషన్‌ రిపోర్టును విడుదలచేసి యాభై శాతం ఫిట్‌మెంట్‌తో ఆర్థిక లబ్ధి చేకూరేలా అమలు చేయాలని కోరుతూ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో మామిడికుదురు ఎంపీడీవో కార్యాలయం వద్ద గురువారం నిరసన తెలిపారు.  కార్యక్రమంలో ఎ.శ్యామలావతి, అప్పన కొండయ్య, బాలం పెద్దిరాజు, పి.వెంకటేశ్వరరావు, టీఆర్‌కే గణపతిరావు, ఎన్‌. నాగదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అల్లవరం: పీఆర్సీ కమిషన్‌ నియమించి మూడేళ్లయి నందున రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ రిపోర్టు వెంటనే విడుదల చేయాలని అల్లవరం మండలం యూటీఎఫ్‌ ఉపాధ్యాయులు గురువారం రిలేదీక్ష ద్వారా నిరసన తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులు మండలపరిషత్‌ అధికారులకు వినతిపత్రం అంద జేశారు.  కార్యక్రమంలో డీబీ వెంకటేశ్వరరావు, ఎంటీవీ సుబ్బారావు, అప్పారి త్రిమూర్తులు, కాకిలేటి సురేష్‌ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

ఉపాధ్యాయుల నిరసన

ముమ్మిడివరం: యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆ సంఘ నేతలు జె.సత్యనారాయణ, యు.దశరఽథరామయ్య, ఎస్‌.శ్రీనివాసరావు, కె.సీతారామయ్య, వి.శ్రీనివాసరావు, బి.బాబూరావు, పి.హరిఅప్పారావు, యు.బుజ్జిబాబు, సీహెచ్‌ దుర్గారావు, కె.రాము, జె.బాలకృష్ణ, బి.శివగణేష్‌, కేఎస్‌ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

తాళ్లరేవు: యూటీఎఫ్‌ మండల శాఖ ఆధ్వర్యంలో విద్యా శాఖ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. వారంలో పీఆర్సీ అమలు చేస్తానని సీఎం జగన్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు.

రాజోలు: 11వ పీఆర్‌సీని తక్షణం అమలుచేయాలని రాజోలు మండల యూటీఎఫ్‌ అధ్యక్షుడు ఉండవల్లి శ్రీనివాస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈసందర్భంగా రాజోలు మండలప్రజాపరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన రిలేదీక్ష, ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోతిబసు పాల్గొన్నారు. అనంతరం ఇన్‌చార్జి ఎంపీడీవో గిడ్ల భీమారావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

ఆలమూరు: పదకొండో పీఆర్సీ వెంటనే ప్రకటించాలని కోరుతూ యూటీఎఫ్‌ నేతలు, ఉద్యోగులు, పంచాయతీల కార్యదర్శులు ఎంపీడీవో, తహశీల్దార్‌లకు వినతిపత్రం అందిం చారు. పీఆర్సీ నిలుపుదల చేయడం వల్ల తాము తీవ్ర ఇబ్బంది పడుతున్నామని వివరించారు.

ఆత్రేయపురం: యూటీఎఫ్‌ మండల శాఖ ఆధ్వర్యంలో మండల పరిషత్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎంఈవో పి.వరప్రసాదరావుకు అందజేశారు. 

కొత్తపేట: యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి వై.మురళి ఆధ్వర్యంలో మండల విద్యా వనరుల కేంద్రం వద్ద నిరసన తెలిపారు. ఎంఈవో ఎం.హరిప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. యూటీఎఫ్‌ నాయకులు ఎంవీవీ సత్యనారాయణ, టి.విజయకృష్ణ, ఎ.రామసుందరరావు, ఎం.రవి, కె.రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 

కపిలేశ్వరపురం: మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట యూటీఎఫ్‌ సభ్యులు ధర్నా నిర్వహించారు. ఎంఈవో కె.తాతారావు, ఎంపీడీవో బీకేఎస్‌ఎస్‌ వెంకట్‌రామన్‌లకు జిల్లా కార్యదర్శి పి.సురేంద్రకుమార్‌, మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐ.సూరిబాబు, ఎం.సూర్యనారాయణ వినతిపత్రాలు అందజేశారు. గౌరవాధ్యక్షుడు యు.శివప్రసాద్‌, ఎ. శ్రీనివాసరావు, ఎంవీ రమణారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

ద్రాక్షారామ: పీఆర్సీ అమలు కోరుతూ యూటీఎఫ్‌ ఆధ్వ ర్యంలో ధర్నా చేశారు. ఎంపీడీవో నాగేశ్వరశర్మ, ఎంఈవో ఎం.శ్రీనివాస్‌, డిప్యూటీ తహశీల్దారు వైద్యనాథ శర్మలకు యూటీఎఫ్‌ జిల్లా ప్రధానకార్యదర్శి ప్రదీప్‌కుమార్‌ వినతి పత్రం అందజేశారు. యుటీఎఫ్‌ పట్టణ, మండల శాఖల అధ్యక్షులు ఆర్‌.శ్రీనివాస్‌, పి.శ్రీనివాస్‌, కార్యదర్శి ఎస్‌.అర్జునరావు, అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

మండపేట: యూటీఎఫ్‌ మండల, పట్టణ శాఖల ఆధ్వర్యం లో మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మండల అధ్యక్షుడు ఎం.త్రినాథ్‌, డీవీ రాఘవులు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



Updated Date - 2021-04-23T05:47:00+05:30 IST