Advertisement

14న జిల్లా స్థాయి బాడీబిల్డింగ్‌ పోటీలు

Feb 28 2021 @ 01:29AM

అమలాపురం టౌన్‌, ఫిబ్రవరి 27: ది ఈస్ట్‌గోదావరి బాడీబిల్డింగ్‌, ఫిజిక్‌ మోడలింగ్‌-2021 పోటీలను మార్చి 14న నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్‌ జిల్లాశాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంటెద్దు వెంకన్నాయుడు, డాక్టర్‌ కంకి పాటి  వెంకటేశ్వరరావు తెలిపారు. కాకినాడ ఆనందభారతి జిమ్‌ ఆధ్వ ర్యంలో ఆనందభారతి గ్రౌండ్స్‌లో ఎన్‌ఆర్‌కే రెడ్డి సారథ్యంలో పోటీలు నిర్వహి స్తు న్నట్టు వివరించారు. 55కేజీలు, 60, 65, 70, 75, 75కేజీలు పైబడిన విభాగాల్లో, ఫిజిక్‌ మోడలింగ్‌ కేటగిరిలో జరిగే పోటీల్లో విజేతలకు నగదు బహుమతి, మెడల్స్‌, షీల్డ్సు అందజేస్తామన్నారు. ఇండియన్‌ బాడీబిల్డింగ్‌ ఫెడరేషన్‌ నిబంధనలు అనుసరించి పోటీలు నిర్వహిస్తున్నట్టు శనివారం అమలాపురం హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ జిమ్‌లో జరిగిన సమావేశంలో వెల్లడించారు.  


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.