ఉమ్మడి జిల్లాలో 298 కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-01-24T04:49:39+05:30 IST

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఆదివారం 298 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఉమ్మడి జిల్లాలో 298 కరోనా కేసులు

సిద్దిపేట/అక్కన్నపేట/సంగారెడ్డి అర్బన్‌/ మెదక్‌ అర్బన్‌, జనవరి 23: ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఆదివారం 298 కరోనా కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లాలో 1,238 మందికి ర్యాపిడ్‌ యాంటిజన్‌ పరీక్షలు నిర్వహించగా 151 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. పీహెచ్‌సీల వారీగా చిన్నకోడూరులో 4, నారాయణరావుపేటలో 1, పుల్లూరులో 1, ఇబ్రహింనగర్‌లో 5 కేసులు నమోదయ్యాయి. కాగా ఇంటింటి సర్వేలో 981 టీంలు 35,969 ఇళ్లల్లో జ్వర సర్వే నిర్వహించారు. 672 మందిలో లక్షణాలు కనిపించడంతో అందరికీ కిట్స్‌ అందజేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట పోలీ్‌సస్టేషన్‌లో ఏఎ్‌సఐతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సంగారెడ్డి జిల్లాలో 1,690 మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు చేయగా పటాన్‌చెరులో 30, సంగారెడ్డి-25, జహీరాబాద్‌-10, నారాయణఖేడ్‌-10, బొల్లారం-3, కంది-3, గుమ్మడిదల-3, ఆర్సిపురంలో ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన 89 మంది హోంఐసోలేషన్‌లో ఉన్నారు. మెదక్‌ జిల్లాలో 312 మందికి ర్యాపిడ్‌ టెస్టులు చేయగా 58 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మెదక్‌లో 30, తూప్రాన్‌లో 11, రామాయంపేటలో 5, పెద్దశంకరంపేటలో 3, రంగపేటలో 2, డి.ధర్మారంలో 1, రేగోడ్‌లో 1, సర్ధనలో 1, రెడ్డిపల్లిలో 3 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కాగా ఆదివారం కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టెస్టుల సంఖ్య తగ్గడంతో పాజిటివ్‌ కేసులు కూడా తగ్గాయి.

Updated Date - 2022-01-24T04:49:39+05:30 IST