Advertisement

51క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

Apr 22 2021 @ 23:22PM

సిద్దిపేట క్రైం, ఏప్రిల్‌ 22: అక్రమంగా తరలిస్తున్న 51క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు గురువారం పట్టుకున్నారు. టూ టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ పరశురామ్‌గౌడ్‌, ఎస్‌ఐ సుధాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ వద్ద రేషన్‌ బియ్యం తరలిస్తున్నారని నమ్మదగిన సమాచారం రావడంతో సిబ్బందితో వెళ్లి తనిఖీలు నిర్వహించారు. డీసీఎంలో తరలిస్తున్న 92బ్యాగుల్లో 51క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. డీసీఎం డ్రైవర్‌, యజమాని మూఢ శ్రీనివా్‌సను అదుపులోకి తీసుకొని విచారించారు. చుట్టుపక్కల గ్రామాల్లో తక్కువ ధరకు కొని, ఎక్కువ ధరకు అమ్మడానికి తీసుకెళ్తున్నట్లు చెప్పాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 


 

Follow Us on:
Advertisement