స్పందనకు 95 అర్జీలు

ABN , First Publish Date - 2022-05-24T07:03:02+05:30 IST

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 95 మంది అర్జీదారులు నేరుగా హాజరై వినతిపత్రాలను అందించారని కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు.

స్పందనకు 95 అర్జీలు
వినతిపత్రాలను స్వీకరిస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

చిత్తూరు, మే 23: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 95 మంది అర్జీదారులు నేరుగా హాజరై వినతిపత్రాలను అందించారని కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు.  ఇందులో రెవెన్యూ శాఖకు 63, డీఆర్‌డీఎకు 4, హౌసింగ్‌కు 9, సంక్షేమ శాఖలకు 5, డీఎంఅండ్‌హెచ్‌వోకు 3, ఇతర శాఖలకు సంబంధించి 11 ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ వెంకటేశ్వర్‌, డీఆర్వో రాజశేఖర్‌, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

రస్తా భూమిని ఆక్రమించుకుంటున్న వారిపై చర్యలు తీసుకోండి

రస్తా భూమిని అక్రమించుకుని లే అవుట్‌ వేయడానికి ప్రయత్నిస్తున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధిపై చర్యలు తీసుకోవాలని పూతలపట్టు మండలానికి చెందిన తొమ్మిది గ్రామాల ప్రజలు డిమాండ్‌ చేశారు. ముత్తిరేవులు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో సర్వే నంబర్లు 77, 78లలో 2.64 ఎకరాల భూమి ఉందని, ఇందులో నుంచే నయనంపల్లె, నయనంపల్లె దళితవాడ, కండ్రిగ, దిగువ కండ్రిగ, ఎగువ కండ్రిగ, వీర్లగుడిపల్లె, వీర్లగుడిపల్లె హరిజనవాడ, మైనగుండ్లపల్లె, మైనగుండపల్లె దళితవాడ, ముత్తరపల్లె, సత్రం గ్రామాల ప్రజలు కాణిపాకం వరకు, బెంగళూరు-తిరుపతి నేషనల్‌ హైవేకు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. ఈ దారిని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు మరికొంతమందితో కలిసి ఆక్రమించుకుని లేఅవుట్‌ వేయడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. తద్వారా తమకు దారి లేకుండా పోతుందని వివరించారు.

చంద్రన్‌కు పరిహారం చెల్లించండి..

అగ్రకులస్థుడి చేతిలో గాయపడిన చంద్రన్‌కు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ సప్తగిరి ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. బాధితుడు చంద్రన్‌తో కలిసి స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతిపత్రాన్ని ఇచ్చారు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదన్న కోపంతో జీడీ నెల్లూరు మండలం పాపిరెడ్డిపల్లె పంచాయతీ పరిధిలోని పెడకంటిపల్లెకు చెందిన ఈశ్వర్‌రెడ్డి దళితుడైన చంద్రన్‌ను కొట్టి కాళ్లు విరిచేశాడని తెలిపారు. ఈశ్వర్‌రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారన్నారు. అట్రాసిటీ కేసు నమోదైన వెంటనే ప్రభుత్వం దళితుడికి ఇవ్వాల్సిన పరిహారాన్ని ఇవ్వడం లేదన్నారు. వెంటనే స్పందించాలని కోరారు.

కోర్టు ఆర్డర్‌ ఉన్నా ఇళ్లు కడుతున్నారు

కోర్టు ఆర్డర్‌ను ధిక్కరించి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పెనుమూరుకు చెందిన రత్నం స్పందనలో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పిం చారు. సర్వే నెంబరు 918-4లో 2.52 ఎకరాల భూమికి సంబంధించి 1974లో ప్రభుత్వం తనకు లీజు పట్టా ఇచ్చిందన్నారు. 2008లో ఈ భూమిని ఆక్రమించుకోవాలని కొంత మంది వచ్చారని.. అప్పట్లో కలెక్టర్‌, ఆర్డీవో, తహసీల్దార్‌కు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని అన్నారు. కోర్టుకు వెళ్లడంతో 2016లో పర్మినెంట్‌ ఇంజెక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చిందన్నారు. అయినా గ్రామంలోని కొంత మంది ఇళ్ల నిర్మాణాలు చేపట్టడానికి ప్రయత్నిస్తున్నారని వాపోయారు. కోర్టు అనుమతి ప్రకారం తనకు న్యాయం 

Updated Date - 2022-05-24T07:03:02+05:30 IST