తడిసిన మొక్కజొన్న పంట

ABN , First Publish Date - 2022-10-02T05:01:36+05:30 IST

అష్టకష్టాలుపడి పండించి, ఆరబెట్టిన మొక్కజొన్న పంట వర్షార్పణమైంది. శనివారం కురిసిన వర్షానికి పంటంతా తడిచిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నా రు.

తడిసిన మొక్కజొన్న పంట
జమ్మానిపల్లిలో వర్షానికి కొట్టుకుపోయిన మొక్కజొన్న

లబోదిబోమంటున్న రైతులు


మడకశిర రూరల్‌,  అక్టోబరు 1: అష్టకష్టాలుపడి పండించి, ఆరబెట్టిన మొక్కజొన్న పంట వర్షార్పణమైంది. శనివారం కురిసిన వర్షానికి పంటంతా తడిచిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నా రు. మండలంలో  మొక్కజొన్న, మిరప పంటలు ఎక్కువగా సాగుచేశారు. రెండు నెలలు క్రితం కురిసిన భారీ వర్షాలకు పంట పొలా ల్లో నీరు చేరి, సాగు చేసిన పంటలు దెబ్బతిన్నాయి. ఆర్థికంగా  రై తులు తీవ్రంగా నష్టపోయారు. మండలంలోని తురుకువాండ్లపల్లి,జమ్మానిపల్లిలో ఆరబెట్టిన మొక్కజొన్న పంట మఽధ్యాహ్నం కురిసి న వర్షానికి  తడసిముద్దయింది. దీంతో రైతులు టార్ఫాలిన పట్టలు కప్పి, వర్షానికి రక్షణగా వేసినా ప్రయోజనం లేకుండాపోయింది.  సీ కొడిగేపల్లికి చెందిన రైతు వెంకటరంగారెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా మొక్కజొన్న, మిరప పంటలు దెబ్బతిన్నాయ న్నారు. రైతులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని కోరారు.


Updated Date - 2022-10-02T05:01:36+05:30 IST