భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-07-27T04:44:27+05:30 IST

భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి

భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి
ఫిర్యాదు చేస్తున్న ఆర్‌.కృష్ణయ్య తదితరులు

ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి: మేడ్చల్‌ జిల్లా కీసర మండలం నాగారంలో ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారి చర్యలు తీసుకోవాలని జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజి ఆచారికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, ఇతర బీసీ నాయకులు సో మవారం ఢిల్లీలో ఆచారిని కలిసి ఫిర్యాదు అందజేశారు. నాగారం-కీసరకు రోడ్డులో 47, 55, 56, 60 సర్వే నెంబర్లలో పదెకరాల ఒక గుంటలో 1960లో అప్పటి పంచాయతీ పాలక మండలి లేవుట్‌కు అమోదం తెలిపిందన్నారు. దానిలో 162 ప్లాట్లు చేసి 12,000 గజాల రోడ్డు స్థలం, 1,670 గజాల్లో పార్కుకు కేటాయించారన్నారు. ఈ స్థలంలో ఐ-కాం కంపెనీ 13,670 చదరపు గజాల స్థలాన్ని అక్రమించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. జాలుబాయి కుంటలోనూ స్థలాన్ని అక్రమించుకున్నారని తెలిపారు. ఈ స్థలాల్లో ప్రభుత్వం గురుకుల పాఠశాలలు, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి వాడుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఫి ర్యాదు ఇచ్చిన వారిలో రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు ప్రసాద్‌గౌడ్‌, హైదరాబాద్‌ అధ్యక్షుడు భూపే్‌షసాగర్‌ ఉన్నారు.

Updated Date - 2021-07-27T04:44:27+05:30 IST