ఎమ్మెల్యే రఘునందర్‌రావుపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-07-30T04:16:57+05:30 IST

ప్రొటోకాల్‌ ఉల్లంఘించి దళిత సర్పంచ్‌ను అవమానించిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్‌రావుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌కు ఎంపీపీల జిల్లా ఫోరం ఆధ్వర్యంలో గురువారం ఫిర్యాదుచేశారు.

ఎమ్మెల్యే రఘునందర్‌రావుపై చర్యలు తీసుకోవాలి
మెదక్‌ కలెక్టర్‌ హరీశ్‌కు ఫిర్యాదు చేస్తున్న జిల్లా ఎంపీపీల ఫోరం

జిల్లా ఎంపీపీల ఫోరం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు ఫిర్యాదు 

మెదక్‌ రూరల్‌/చిన్నశంకరంపేట/పెద్దశంకరంపేట/జూలై 29 : ప్రొటోకాల్‌ ఉల్లంఘించి దళిత సర్పంచ్‌ను అవమానించిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్‌రావుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌కు ఎంపీపీల జిల్లా ఫోరం ఆధ్వర్యంలో గురువారం ఫిర్యాదుచేశారు. ఈ సందర్భంగా ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు హరికృష్ణ మాట్లాడుతూ నార్సింగి మండలం వల్లూరు గ్రామపంచాయతీ భవన నిర్మాణం ఈనెల 28న ప్రారంభించారన్నారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు సర్పంచ్‌ రాజేశ్వరి, అదే గ్రామానికి చెందిన మండలాధ్యక్షురాలు సబితకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రారంభోత్సవం చేశారన్నారు. ప్రొటోకాల్‌ విస్మరించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు యమున, భాగ్యలక్ష్మి, శ్రీనివాస్‌, మంజుల పాల్గొన్నారు. సర్పంచ్‌ లేకుండా నూతన పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభం చేయడం బాధాకరమని చిన్నశంకరంపేట ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్‌ లేకుండా ఎమ్మెల్యే రఘునందన్‌రావు భవనాన్ని ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. దళితుల పట్ల బీజేపీ, ఆ పార్టీ ఎమ్మెల్యే చిన్నచూపు చూస్తున్నారని పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్‌ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నార్సింగి మండలం వల్లూరు సర్పంచ్‌ మహేశ్వరీనరేష్‌ పుస్తెలతాడు కుదువపెట్టి గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మిస్తే ఎమ్మెల్యే సమాచారం ఇవ్వకుండా ఉపసర్పంచ్‌తో ప్రారంభించడం ఎంతవరకు సమంసజమని ప్రశ్నించారు. దళిత మహిళా సర్పంచ్‌ కావడంతోనే ఇలా చేశారన్నారు. 

Updated Date - 2021-07-30T04:16:57+05:30 IST